అగ్ని-5 క్షిపణి విజయవంతం

4

భువనేశ్వర్‌,జనవరి31(జనంసాక్షి):  అగ్ని-5 క్షిపణి పరీక్ష విజయవంతమైంది. బాలాసోర్‌లోని వీలర్‌ ఐల్యాండ్‌ నుంచి శనివారం ఉదయం అగ్ని-5 క్షిపణిని శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించారు. అగ్ని-5 క్షిపణి 5వేల కిలోవిూటర్ల దూరంలోని లక్ష్యాన్ని లద్కదించగలదు. ఉపరితలం నుంచి ఉపరితలానికి వెయ్యికిలోల అణ్వసౄలను ఒకేసారి మోసుకెళ్లగలుగుతుంది. అగ్ని-5 క్షిపణి పరీక్షను విజయవంతం చేసిన శాస్త్రవేత్తలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ క్షిపణితో భారత అణ్వాయుధాలకు మరింత శక్తి చేకూరిందని వ్యాఖ్యానించారు. ఈ ఘనత సాధించిన శాస్త్రవేత్తలకు తాను సెల్యూట్‌ చేస్తున్నానంటూ ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు. ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సైతం శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల కృషిని కొనియాడారు.