అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలి
విజయవాడ,జూన్28(జనం సాక్షి): అగ్రిగోల్డ్ బాధితుల హావిూలను నెరవేర్చేందుకు ప్రవేశపెట్టిన జీవో నెంబరు 80ను వెంటనే అమలు చేయాలని సిపిఐ డిమాండ్ చేసింది. జిల్లాల వారీగ కాకుండా ఒకేచోటకు ఈ కేసులను బదలాయించి,హైకోర్టు తీర్పు మేరకు ఆస్తులు అమ్మి బాధితులకు న్యాయం చేయాలన్నారు.లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలకు సిద్ధపడుతున్నట్లు బాధితుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు హెచ్చరించారు. గత కొన్ని నెలలుగా అగ్రిగోల్డ్ బాధితులు పోరాటం చేస్తున్నారని, విజయవాడలో నిరాహార దీక్ష చేపట్టిన ఫలితంగా ప్రభుత్వం దిగివచ్చి మృతిచెందిన వారికి రూ. 5 లక్షల నష్టపరిహరం చెల్లిస్తామని చెప్పి దానిపై కూడా ఆంక్షలు విధించిందని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆరు హావిూలను నెరవేర్చకపోతేఉద్యమం చేస్తామన్నారు. ఇప్పటివరకూ 130 మంది అగ్రిగోల్డ్ బాధితులు మరణించారన్నారు. ఆయా కుటుంబాలను పట్టించుకోవడం లేదన్నారు.