అడవుల చుట్టూ కందకాలు

ఫెన్సింగ్‌ తరహాలో ముళ్ల  చెట్ల పెంపకం
అడవుల రక్షణకు పక్కా ప్రణాళిక
ఆదిలాబాద్‌,మే10(జ‌నం సాక్షి): జిల్లాలో అడవులను కాపాడుకునేందుకు అధికారులు సరికొత్త ప్రణాళికలు తయారు చేశారు. అడవులు చుట్టూ దాదాపు వేయి కిలోవిూటర్ల మేర కందకాలను తీసి వాటిల్లో వివిధ రకాల మొక్కలను నాటాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు 500 కిలోవిూటర్లు వరకు కందకాలు తవ్వినట్లు అటవీశాఖ
అధికారులు తెలిపారు. అటవీ హద్దుల్లో తీసిన కందకాల్లో మూడు రకాల మొక్కలను పెంచనున్నారు. నాలుగో విడత హరితహారంలో కిలో విూటరుకు 3 వేల మొక్కల చొప్పున నాటుతారు. హద్దులోని కందకానికి అవతలివైపు గచ్చకాయ, మధ్యలో పూల మొక్కలు, అడవికి లో పలి ప్రాంతంలో వెదురు మొక్కలను నాటుతారు. అ వతలివైపు గచ్చగాయ మొక్కలకు పెరిగిన కొద్దీ ముళ్లు వస్తాయి. చెట్లుగా మారిన తర్వాత ఎక్కువగా ముళ్లు తయారై మనుషులు, పశువులు లోనికి ప్రవేశించే అవకాశం ఉండదు. లోపలి వైపు వెదురు మొక్కలు నాటుతారు. ఇవి దట్టంగా ఉండడంతో లోపలి నుంచి బయటకు వెళ్లరాదు. మూడు రకాల మొక్కలకు బయో పెన్సింగ్‌ రక్షణ ఉంటుందని అటవీశాఖ అధికారులు తెలిపారు.జిల్లాలోని దట్టమైన అడవులు పలు కారణాలతో అంతరించిపోతున్నాయి. కలప అక్రమ రవాణా, వ్యవసాయ భూముల కోసం అడవుల నరికివేతతో పాటు మొరం తవ్వకాలు, ఇసుక అక్రమ రవాణా కారణంగా అటవీ ప్రాంతానికి నష్టం వాటిల్లుతోంది. అడవులను రక్షించడానికి అటవీశాఖ అధికారులు తీసుకుంటున్న చర్యలు అంత మాత్రంగానే ఫలితాలను ఇస్తున్నాయి. జిల్లాలోని 40.10 చదరపు కిలోవిూటర్ల భూ భాగంలో అడవులు విస్తరించి ఉన్నాయి. ఆదిలాబాద్‌ రూరల్‌, మావల, తలమడుగు, తాంసి, ఇంద్రవెల్లి, ఉట్నూర్‌, ఇచ్చోడ, సిరికొండ, బోథ్‌, బజార్‌హత్నూర్‌ మండ లాల్లో అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉంది.  జి ల్లాలో ఆదిలాబాద్‌, బేల, ఇచ్చోడ, బోథ్‌, ఉట్నూర్‌, ఇంద్రవెల్లి, నేరడిగొండతో పాటు కవ్వాల్‌ టైగర్‌ జోన్‌ పరిధిలోని సిరిచెల్మ, బిర్సాయిపేట అటవీశాఖ రేంజ్‌ లు ఉన్నాయి.  హరితహారంలో భాగంగా 500 కిలోవిూటర్ల మేర 15 లక్షల మొక్కలు నాటేందుకు అవకాశం ఉంది. దీంతో అడవులు సంరక్షణ జరుగడమే కాకుండా అటవీ ప్రాంతం పెరుగుతుందని అధికారులు అంటున్నారు. అడవి చుట్టూ తవ్విన కందకాల్లో అవసరమైన మొక్కలు నాటేందుకు అధికారులు నర్సరీలను సైతం ఏర్పాటు చేశారు.

తాజావార్తలు