అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరుగని పోరాట యోధుడు బాబు జగ్జీవన్ రామ్

 

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ

అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం అబ్రహం

ఇటిక్యాల జులై 23 (జనంసాక్షి) ఒకవైపు దేశ స్వాతంత్రం కోసం పోరాడుతూనే మరొకవైపు సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన పోరాట యోధుడు బాబు జగ్జీవన్ రామ్ అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపన అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. శనివారం జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండల కేంద్రంలో భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ, అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ వి. ఎం అబ్రహం, ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి మంద జగన్నాథం, జోగులాంబ గద్వాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత లు హాజరై బాబు జగ్జీవన్ రామ్ విగ్రహా అవిష్కరణ చేసి బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులరహిత సమాజం, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని త్యాగంచేసిన గొప్ప నాయకుడు డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌ రామ్‌ అని కొనియాడారు. జగ్జీవన్‌ రామ్‌ వంటి మహానీయుల ఆశయ సాధనలో ప్రభుత్వాలు పని చేయాలని వారు అన్నారు. జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో కులరహిత సమాజ నిర్మాణం కోసం అందరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అలంపూర్ మాజీ శాసనసభ్యులు ఎస్ ఏ సంపత్ కుమార్, ఎర్రవల్లి సర్పంచ్ జోగుల రవి, ఎమ్మార్పీఎస్ నాయకులు మస్తాన్, జయరాజు, శంకర్, శ్రీనివాసులు, ఎలీషా, ఐజ రాజు, విజయ్, ప్రభుదాస్, శీను, కిషోర్ తోపాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.