అత్యాచారాల్లో తెలంగాణ నెంబర్ పచ్చి అబద్దాలకోరు ముఖ్యమంత్రి కేసీఆర్

 

 

నర్సాపూర్, సెప్టెంబర్, 28 , ( జనం సాక్షి ) :

మహిళలపై అత్యాచారాలు జరిగిన రాష్ట్రాల్లో దక్షిణ భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్రం గా ఉందని వైయస్సార్ టిపి రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల అన్నారు వైయస్సార్ షర్మిల చేపడుతున్న పాదయాత్ర బుధవారం సాయంత్రం నర్సాపూర్ కు చేరుకుంది ఈ సందర్భంగా నర్సాపూర్ పట్టణంలోని బస్టాండు వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో షర్మిల ప్రజల ను ఉద్దేశించి మాట్లాడారు ముఖ్యమంత్రి కేసీఆర్ 8 సంవత్సరాల పాలనలో రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని విమర్శించారు తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలకు బ్రతుకులేని రాష్ట్రంగా మార్చడమే కాకుండా అప్పుల తెలంగాణగా తయారు చేశారని మండిపడ్డారు ఎనిమిది సంవత్సరాల పాలనలో తెలంగాణ రాష్ట్రంపై నాలుగు లక్షల కోట్ల అప్పులను ముఖ్యమంత్రి చేశాడన్నారు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలలో డబుల్ బెడ్ రూమ్ దళితులకు మూడు ఎకరాల భూమి మహిళల సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంట రుణమాఫీ వంటి హామీలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా సక్రమంగా అమలుపరచలేదని అన్నారు 8 సంవత్సరాల పాలనలో ఎంతమందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చాడో ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పాలని ఆమె సవాల్ చేశారు మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా విఫలం చేద్దాడన్నారు మహిళలకు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికె ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నాడని అన్నారు నర్సాపూర్ నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్నాడని నియోజకవర్గానికి ఏమి చేసాడో చెప్పాలని అన్నారు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదలకు ఉపయోగపడే విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు రాజశేఖర్ రెడ్డి మరణించి 13 సంవత్సరాలు కావస్తున్నా నేటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడన్నారు మహానేతకు మరణం లేదన్నారు వైయస్ రాజశేఖర్ రెడ్డి పథకాలను కొనసాగించేందుకే తను వైయస్సార్ టిపి పార్టీని స్థాపించినట్లు ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఈ పూరి సోమన్న భరత్ రెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి ఆగమయ్య ప్రజలు భారీగా పాల్గొన్నారు