అదుపులో నిపా వైరస్‌

సమాచారం తెలిసిన వెంటనే కట్టుదిట్టమైన చర్యలు

ఎయిమ్స్‌ వైద్యులను కేరళకు పంపి చర్యలు తీసుకున్నాం: నడ్డా

న్యూఢిల్లీ,జూన్‌6(జ‌నం సాక్షి): దేశంలో నిఫా వైరస్‌ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు తసీఉకున్నామని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు సూచనలు అందాయని తెలిపింది. కేరళ రాష్ట్రంలో వెలుగుచూసిన నిపా వైరస్‌ను పన్నెండు గంటల్లోనే అదుపులోకి తీసుకువచ్చామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా వెల్లడించారు. కేరళ రాష్ట్రంలో నిపా వైరస్‌ సోకిందని తెలియగానే 12 గంటల్లోపే కేంద్రం నుంచి వైద్యుల బృందాలను కేరళకు పంపించానని నడ్డా పేర్కొన్నారు. తాను స్వయంగా సవిూక్షించి నిపా వైరస్‌ నిరోధానికి చర్యలు తీసుకున్నానన్నారు. ప్రస్థుతం నిపా వైరస్‌ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి కోరారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌ వైద్యులు, సప్దర్‌ జంగ్‌ ఆసుపత్రి, పూణెళిలోని నేషనల్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ , జాతీయ వ్యాధుల నివారణ కేంద్రం వైద్యులు కేరళ వైద్యాధికారులకు సహకరించారని కేంద్రమంత్రి చెప్పారు. నిపా వైరస్‌ వల్ల 16 మంది మరణించిన నేపథ్యంలో జూన్‌ 12వతేదీ వరకు కోజికోడ్‌ లోని విద్యాసంస్థలను ముందుజాగ్రత్త చర్యగా మూసివేశామని మంత్రి పేర్కొన్నారు. కోజికోడ్‌, మణప్పురం, వయానద్‌, కన్నూర్‌ జిల్లాల్లో పర్యటించవద్దని కేరళ వైద్యశాఖ ప్రచారం చేసిందన్నారు. ముందస్తు ప్రచారం బాఆ పనిచేసిందని, కేరళ సర్కార్‌ కూడా సకాలంలో చర్యలు తీసుకుందని అన్నారు.