బతుకమ్మ సంబురాల్లో గొడవజవాన్‌పై దాడి

 

జోగులాంబ గద్వాల : బతుకమ్మసంబురాల్లో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరి మధ్య గొడవ ఓ ఆర్మీ జవాన్‌ప్రాణాల మీదకు తెచ్చింది. వివరాల్లోకి వెళ్తే..గద్వాల జిల్లా( ధరూర్ మండలం రేవులపల్లి గ్రామంలో ఓ ఇంటి దగ్గర రాత్రి బతుకమ్మ సంబురాలను ఆట, పాటలతో ఘనంగా నిర్వహించుకున్నారు. కాగా, ఇదే సమయంలో ఇంటి పక్కనున్న కృష్ణ అనే యువకుడు మైక్‌ సౌండ్ పెంచొద్దని వెంటనే బంద్ చేయలంటూ వాదనకు దిగాడుఅయితే కొద్దిసేపు ఆగాలంటూ నిర్వాహకులు చెప్పినా వినకుండా కృష్ణ గొడవకు దిగి వారిపై పిడిగుద్దులతో దాడికి దిగాడు. ఇంతలో అక్కడే ఉన్న ఆర్మీ జవాన్ గొడవను అడ్డుకోవడానికి వెళ్తే.. సహనం కోల్పోయిన కృష్ణ ఇంట్లోకి వెళ్లి కత్తి తీసుకొని వచ్చి ఆర్మీ జవాన్‌పై దాడి(Knife attack) చేసాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన ఆర్మీ జవాన్ ను చికిత్స కోసం గద్వాల హాస్పిటల్‌కు తరలించారు. గొడవ చేసి దాడికి పాల్పడిన కృష్ణ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నట్లు గద్వాల సీఐ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు.