అద్వానీ, అమితాబ్‌లకు పద్మవిభూషణ్
న్యూఢిల్లీ, జనవరి 25(జనంసాక్షి): భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించింది. 9 మందికి పద్మవిభూషణ్, 20 మందికి పద్మభూషణ్, 75 మందికి పద్మశ్రీ మొత్తం 104 మందికి ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పద్మవిభూషణ్ అవార్డు పొందిన వారిలో అద్వానీ, అమితాబ్‌లు ఉన్నారు.
అవార్డులు పొందినవారు:
పద్మవిభూషణ్: బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, దిలీప్ కుమార్, బీజేపీ అగ్ర నేత ఎల్‌కే అద్వానీ, ప్రకాష్
సింగ్ బాదల్, వీరేంద్ర హెగ్డే, ప్రొఫెసర్ మల్లార్ రామస్వామి, కొట్టాయన్ కె వేణుగోపాల్, కరీమ్ ఆల్ హుసేని ఆగా ఖాన్,
పద్మభూషణ్: మైక్రోసాప్ట్ చీఫ్ బిల్‌గేట్స్, ఆయన భార్య మిలిందా గేట్స్, సాహితీవేత్త రంజిత్ శర్మ, స్వపన్ దాస్
గుప్త, మాజీ సీఈసీ ఎన్ గోపాలస్వామి, రాజ్యాంగ నిపుణుడు సుభాష్ సీ కస్యప్, న్యాయవాది హరీష్ సాల్వే, విజయ్ భక్తర్, కార్డియాలజిస్ట్ అశోక్ సేత్, సినీ నిర్మాత జాను బారువా. సత్పాల్, శివకుమార్ స్వామి, ఆచార్య మంజుల్ భార్గవ్
పద్మశ్రీ అవార్డులు పొందిన తెలుగు వారు: సినీ నటుడు కోట శ్రీనివాసరావు, డాక్టర్ అనగాని మంజుల, బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, క్రికెట్ మహిళా క్రీడాకారిని మిథాలిరాజ్, ప్రముఖ కేన్సర్ వ్యాధి నిపుణుడు నోరి దత్తాత్రేయుడు, డాక్టర్ రఘురాముడు, ఆధ్యాత్మిక గురువు దివంగత సైయద్ మెహ్మద్ బుర్హానుద్దీన్, పాటల రచయిత జోషి, టీవీ మోహన్ దాస్