అధికారుల డైరెక్టర్ల పదవులు పునరుద్ధరించాలి.

సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి అధ్యక్షులు బియ్యంకార్ శ్రీనివాస్.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. నవంబర్ 9. (జనంసాక్షి). సహకార విద్యుత్ సంస్థ సెస్ లో మధ్యలో నిలిపివేసిన అధికారుల డైరెక్టర్ పదవులను పునరుద్ధరించాలని కోరుతూ సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి అధ్యక్షులు బియ్యంకార్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. బుధవారం వినతి పత్రం అందజేసిన అనంతరం బియ్యంకార్ శ్రీనివాస్ మాట్లాడుతూ సెస్ బైలా ప్రకారం డైరెక్టర్ హోదాలో నామినేటెడ్ అధికారులు డి సి ఓ, ఆర్ఇసి, ఎస్ ఈ, సెస్ ఎం డి లు ఉండాల్సి ఉందని అన్నారు. వీటిని అమలు పరచకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. పాలకవర్గం చేసిన తప్పులను నిలదీస్తారనే ఉద్దేశంతోనే డైరెక్టర్ పోస్టులను భర్తీ చేయడం లేదని ఆరోపించారు. యధావిధిగా డైరెక్టర్లుగా కొనసాగించాలని అధికారులకు ఇచ్చిన వినతిపత్రంలో కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో కుసుమ గణేష్ తదితరులు పాల్గొన్నారు.