అధిక సాంద్రత పద్దతిలో ప్రత్తి సాగు

నారాయణఖేడ్ నియోజకవర్గంలో ని మనూర్ మండలంలోని   మాయి కోడ్  గ్రామంలో  అదిక సాంద్రత పద్ధతి లో పత్తి సాగు ప్రదర్శన కార్యక్రమంలోబుధువారం  మండల వావ్యసాయ అధికారి శ్రీనివాస్ రెడ్డి  మరియు వవ్యసాయ విస్తరణ అధికారి సంగమేశ్వర్ ,పాల్గొన్నారు. వారుఈ సందర్బంగా పలు  సూచనలు చేశారు. ఈ విధానంలో సాగు చేయుటకు అనువైన వంగడాలు నేలలు తేలిక సారవంతమైన నేలలు, తటస్థపి హెచ్  గల నేలలు ఈ విధానంలో సాగు చేయుటకు అనుకూలంమన్నారు. నీరు నిలువ ఉండని నేలలు చవుడు క్షార లక్షణాలు లేని నేలల్ని ఎంపిక చేసుకోవాలన్నారు. మామూలు  పద్దతిలో ఎకరాకు 6500 నుండి 8500 వరకు వుండే మొక్కల సంఖ్యను మూడు నుండి నాలుగు రెట్లు పెంచి విత్తుకోవాలి అంటే ఎకరాకు 25000-30000 మొక్కలు ఉండే విధంగా మొక్కల మధ్య 20 సెo. మీ పంట సాళ్ల మధ్య 75 -80సెం దూరం ఉండే విధంగా విత్తుకోవాలన్నారు. ఈ విధానం లో సాగుకు ఎంపిక చేసే రకాలను గురించి తెలియ చేస్తూ నూజివీడు కంపెనీ వారి ఎన్ సి ఎస్ -2778 ,సిరి(ఎన్ సి ఎస్ -927) రకాలను కానీ లేదా ఎ బి డి  -39 లేదా రాశి వారి  ఆర్ సి హెచ్   -665,ఆర్ సి హెచ్  797వంటి రకాలలో ఎదో ఒక రకాన్ని ఎంపిక చేసుకోవాలన్నారు. ఎరువుల యాజమాన్యం విషయానికి వస్తే 48-24-24-కేజీ  ల ఎన్ పి కె  ఎరువులను అందచేయాలన్నారు. వీటిలో మొత్తం భాస్వరం, ఎస్ ఎస్ పి  లేదాడి ఎ పి  రూపంలో వేయాలన్నారు. నత్రజని మరియు పోటాష్ 20-40-60-80 రోజులలో నాలుగు సమ భాగాలుగా వేయాలన్నారు. 25:30కేజీల యూరియా మరియు 10-15 కేజీల పోటాష్ చొప్పున అందించాలన్నారు. అదేవిధంగా 2,3 సార్లు బోరాన్ లీటర్ నీటికి 2 గ్రా చొప్పున పూత దశలో మెగ్నీషియం సల్ఫేట్ లీటర్ నీటికి 10 గ్రా చొప్పున పిచికారీ చెయ్యాలన్నారు.  చాలా ముఖ్యమైన విషయం   హెచ్ డి పి ఎస్  ద్దతిలో పంట పెరుగుదలను నియత్రించుటకు గ్రోత్  రెగ్యులటర్  మేపిక్వాట్  క్లోరైడ్   తప్పకుండా 2 లేదా 3 పర్యాయాలు పిచికారి చేయాలన్నారు.
తప్పకుండా 2 లేదా 3 పర్యాయాలు పిచికారి చేయాలన్నారు. మొదటి సారి 45 రోజుల దశలో 100యం యల్  మరియు 65 రోజులలో 150 యం యల్   రెండు సార్లు పిచికారి చేయాలన్నారు.  అవసరాన్ని బట్టి మూడవ సారి 200 యం యల్  పిచికారీ 85 రోజుల దశలో పిచికారీ చేయాలన్నారు . పై విధంగా మేపిక్వాట్  క్లోరైడ్  ను  వాడుతూ, మిగతా అన్ని యాజమాన్య పద్దతులను సక్రమంగా పాటిస్తే పంట అంత డిసెంబర్  వరకు ఒకే సారి తీసేందుకు సిద్దమవుతుందన్నారు. కాయలన్నీ ఒకే సారి పగులుతాయి ఎకరాకు 10-15 క్వింటాళ్ల దిగుబడి వస్తుందన్నారు. ప్రత్తిని తీసిన పిదప రైతులు దుక్కులు చేసుకొని రెండవ పంటగా  రబీ మినుము, జొన్న, నువ్వులు లేదా మొక్కజొన్న పంటలను విత్తుకోవచ్ఛ న్నారు . ఈ విధంగా రైతులకు నికర ఆదాయం పెరుగుతుందని . పంట మార్పిడి కూడా జరుగుతుందన్నారు.   రైతులు ఈ వానాకాలము లో  అధిక విస్తీర్ణంలో  హెచ్ డి పి ఎస్  విధానములో ప్రత్తి సాగు చేయాలని కోరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో యం ఎ ఓ  శ్రీనివాస్  రెడ్డి , ఈ ఓ  సంగమేశ్వర్,  రైతులు   రమేష్ ,కరెప్ప తదితరులు పాల్గొన్నారు. 

తాజావార్తలు