అధైర్య పడొద్దు అండగా ఉంటాం
భద్రాద్రి కొత్తగూడెం జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య
టేకులపల్లి, అక్టోబర్ 18( జనం సాక్షి): టేకులపల్లి మండలంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య మంగళవారం పర్యటించి పలువురిని పరామర్శించారు. ఇటీవల కొత్తతండాకు చెందిన బానోత్ వీరన్న విద్యుత్ ఘాతానికి గురై మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, 5 రూపాయలను, ఒక క్వింటా బియ్యం ఆర్థిక సహాయమందించి,అధైర్య పడొద్దు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా శంభుని గూడెంలో ఇటీవల మృతి చెందిన కాకటి ప్రమోద్ కుటుంబ సభ్యులను కలిసి 5000 రూపాయల ఆర్థిక సహాయం చేసి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం పర్యటనలో భాగంగా సులానగర్ హైస్కూల్లో మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు. విద్యాబోధన జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. సులానగర్ లో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మృతి చెందిన బోరింగ్ మెకానిక్ గుంటి సుధాకర్ భౌతిక ఆయన సందర్శించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో వారివెంట నియోజకవర్గ నాయకులు కోరం సురేందర్,బుర్రా ధర్మయ్య గౌడ్, బోడా మంగీలాల్ నాయక్,బట్టు విజయ్,మాజీ ఎంపీటీసీ చింతల సురేష్, మాలోత్ తారాచంద్,రాజు గౌడ్,నర్సయ్య గౌడ్,కోరం కుమార స్వామి,శంకర్,మోహన్ రావు,రవి,మహేష్,బానోత్ రవి,గడ్డం మధు రెడ్డి, రావూరి సతీష్, సులానగర్ సర్పంచ్ అజ్మీర బుజ్జి, వైస్ ఎంపీపీ ఉండేటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.