అనాథ వృద్ధ దంపతులకు చేయూత
పవర్‌హౌస్‌కాలనీ, జూన్ 12, (జనంసాక్షి):
గోదావరిఖని ఉదయ్‌నగర్ బస్‌షెల్టర్‌లో గత కొన్నేళ్ళుగా తలదాచుంకుటున్న అనాథ వృద్ద దంపతులకు మంగళవారం గోదావరిఖని స్పందన స్వచ్చంద సేవా సమితి చేయూతని చ్చింది. సుద్దాల లక్ష్మయ్య – గంగమ్మలను సమి తి సభ్యులు విఠల్‌నగర్‌లోని శ్రీధర్మశాస్త్ర వృదా శ్రమంలో చేర్పించారు. ఈ కార్యక్రమంలో సమితి బాధ్యులు అబ్బోజు రాంబాబు, ఇతర పక్షాల బాధ్యులు కౌటం బాబు, రఘువీర్‌సింగ్, నజీముద్దీన్, మహేష్, చంద్రమౌళి, రాజిరెడ్డి, శంకర్, మధుకర్, రాజు, అనీల్, హరినాథ్, నర్సయ్య, మురళీ, గోపాల్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ఆవుదూడ బహుకరణ… మనోచైతన్య మానసిక వికలాంగుల పాఠశాలకు కొందరు ఆవుదూడను బహుకరించారు. పాలూరి వెంకటనారాయణ, కృష్ణ, సత్యప్రసాద్, జ్యోతిర్మయి, విజయదుర్గలు మనోచైతన్య నిర్వాహకులు కృష్ణకుమార్‌కు అందచేశారు.