అనుమతి లేకుండా బాణసంచా విక్రయించరాదు

మున్సిపల్ కమిషనర్ చీక్యాల రత్నకర్ రావు
ఖానాపూర్ రూరల్ 22 అక్టోబర్ (జనం సాక్షి): ఖానాపూర్ మున్సిపల్ శాఖ అనుమతి లేకుండా బాణసంచా విక్రయించరాదు అని ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్ చీక్యాల రత్నకర్ రావు అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 24 న నిర్వహించే దీపావళి పండుగ సందర్భంగా ఖానాపూర్ మున్సిపల్ సంఘ పరిధిలో బాణసంచా విక్రయ దుకాణం యజమానులు మున్సిపల్ అనుమతి లేకుండా ఎటువంటి బాణసంచా విక్రయించరాదు అని ఆయన అన్నారు. మున్సిపల్ అనుమతి లేకుండా బాణసంచా విక్ర యించినచో దుకణములను సీజ్ చేసి జరిమానా విధించడం జరుగుతుంది అని ఆయన తెలిపారు.