అన్నదాతలు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలి
– డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి
కుల్కచర్ల, నవంబర్ 10 (జనం సాక్షి):
అన్నదాతలు కొనుగోలు కేంద్రాలకు తాలు, మట్టి లేకుండా నాణ్యమైన ధాన్యాన్ని తీసుకురావాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి కోరారు.గురువారం కుల్కచర్ల మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం పండుగలా మారిందని,ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అన్నారు.రైతులకు అండగా ప్రభుత్వం ఉంటుందని ఆయన సూచించారు.ప్రభుత్వం క్వింటాల్ కు గ్రేడ్ -ఏ ధాన్యానికి రూ.2060, సాధారణ ధాన్యానికి రూ.2040 మద్ధతు ధర చెల్లిస్తోందన్నారు.కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామని చెప్పారు.ఈనెల 14 నుండి ఉమ్మడి కుల్కచర్ల మండలంలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లుగా ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బృంగి హరికృష్ణ, పీఏసీఎస్ వైస్ చైర్మన్ నాగరాజ్ యాదవ్, తెరాస నాయకులు రాజప్ప, మాలే కృష్ణయ్య గౌడ్, కనకం మొగులయ్య, బచ్చిరెడ్డి, కాంగారి అంజనేయులు, రాంలాల్, బాల్ రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.