అన్నదానం మహాదానం

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ) : అన్నదానం మహాదానమని జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌ శ్రీరామలింగేశ్వర త్రిశక్తి అయ్యప్ప ఆంజనేయస్వామి దేవాలయ కమిటీ చైర్మన్‌ అనంతుల సూర్యనారాయణ అన్నారు.బుధవారం ఆ దేవాలయంలో ఎన్‌ఆర్‌ఐ కొంపెల్లి అనీల్‌ రెడ్డి, ఆస్రిత దంపతుల ఆధ్వర్యంలో సక్కునూరు వేణుగోపాల్‌, వాసవి దంపతుల సహకారంతో ప్రతి బుధవారం మాలాధారణ స్వాములకు ఏర్పాటు చేసే అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.ఇతర దేశంలో ఉండి సొంత ఊరును గుర్తించుకొని సేవ చేయడం అభినందనీయం అన్నారు.ఈ కార్యక్రమంలో తోట శ్యాం ప్రసాద్ , వాసుదేవరావు , సురేష్‌రెడ్డి , ప్రభాకర్‌ , దుర్గాప్రసాద్‌ , పూజారి సతీష్‌ శర్మ తదితరులు పాల్గొన్నారు.