అన్నపూర్ణాదేవి అలంకారంలో భద్రకాళి అమ్మవారు
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 27(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని చారిత్రక శ్రీ భద్రకాళి దేవాలయంలో నిర్వహిస్తున్న శ్రీదేవి శరన్నవరాత్ర ఉత్సవాలలో భాగంగా మంగళవారం భద్రకాళి అమ్మవారిని అన్నపూర్ణ దేవి అలంకారంలో వైభవంగా అలంకరించారు. ఆలయ అర్చకులు ఉదయం నుంచి రాత్రి వరకు అమ్మవారికి విశేష పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా నలుమూలల నుండి అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు వచ్చారు. ఆలయ ఈవో శేషు భారతి, ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు, ఇతర అర్చక బృందం భక్తులకు అన్ని రకాల ఏర్పాటు చేశారు. అమ్మవారి సన్నిధిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు వచ్చే నెల 6 వ తారీకు వరకు నిర్వహిస్తున్న ఉత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.
Attachments area