అన్నా పోరుకు సోనియా మద్దతు
న్యూఢిలీ, మార్చి18(జనంసాక్షి): భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా అన్ని వేదికలపైనా పోరాడాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపు ఇచ్చారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా గాంధేయవాది అన్నా హజారే చేపట్టనున్న పాదయాత్రకు ఆమె సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ఆమె అన్నాకు ఓ లేఖ రాశారు. భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా 14 పార్టీలు సోనియా నేతత్వంలో మంగళవారం రాష్ట్రపతి భవన్‌కు చేపట్టిన ర్యాలీపై అన్నా తనకు రాసిన లేఖకు ఆమె సమాధానంగా ఈ లేఖ రాశారు.
‘భూసేకరణ చట్ట సవరణ బిల్లుపై విూరు సందేహాలు వ్యక్తం చేస్తూ మార్చి 14న విూరు రాసిన లేఖ అందింది. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్సు, సవరణ బిల్లుపై విూ అభిప్రాయాలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. ఇది పూర్తిగా రైతు ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉంది. అన్ని వేదికలపైనా కాంగ్రెస్ ఈ బిల్లును వ్యతిరేకిస్తుంది. రాష్ట్రపతి భవన్‌కు ర్యాలీ చేపట్టడం కూడా బిల్లుపై మా వ్యతిరేకతను వ్యక్తం చేయటంలో భాగమే. దీనికి సంబంధించి మా పోరాటం కొనసాగుతుందని విూకు హావిూ ఇస్తున్నా’అని సోనియా ఆ లేఖలో పేర్కొన్నారు.