అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచినతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

కళ్యాణ లక్ష్మి, చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే
మల్తకల్ జూలై 7 (జనంసాక్షి) గద్వాల నియోజకవర్గ   మల్డకల్ మండలంలోని రైతు వేదిక భవనం లో  కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగాఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు.తాసిల్దార్ ఎమ్మెల్యేకు పూల మొక్క ఇచ్చి స్వాగతం పలికారు. మండలంలోని 36 మందికి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మిచెక్కులనులబ్ధిదారులకుఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గురువారంఅందజేశారు.
కళ్యాణ లక్ష్మి చెక్కుల తీసుకున్న మల్లెం దొడ్డి గ్రామస్తులు ఎమ్మెల్యే 20 దుప్పట్లలను బహుకరించారు.రైతు వేదిక భవనం ఆవరణంలోఎమ్మెల్యే హరితహారం కార్యక్రమం భాగంగా మొక్కలు నాటారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోమల్డకల్ మండలం లోని అన్ని గ్రామాలు అభివృద్ధి చెందుతూ గ్రామాలలో డంపింగ్ యాడ్ లు, పల్లె ప్రకృతి వనం,హరితహారం, రైతు వేదికలు, వైకుంఠ ధాములు ఏర్పాటు చేసి గ్రామాలను అందగా సుందరంగా తీర్చిదిద్దడం జరుగుతుంది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో  ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకం ప్రవేశపెట్టి ఆసరా పింఛన్, వికలాంగులకు పింఛన్,రైతుల కొరకు రైతుబంధు, రైతు బీమా 24 గంటల కరెంటు,కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, మిషన్ భగీరథ  ద్వారా ప్రతి ఇంటికి మంచి నీరు కెసిఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది కల్యాణలక్ష్మి షాదీ ముబారక్ లక్ష నూట పదహారు రూపాయలు అందజేశార.
ప్రతి పేద ఇంటికి పిల్లలు జన్మించినప్పుడు కెసిఆర్ కిట్టు మగ పిల్లవాడు జన్మిస్తే 12000 ఆడపిల్ల జన్మిస్తే 13000 వేలు ఇచ్చిపుట్టినప్పటి ,కెసిఆర్ కిట్టు పిల్లలు చదువుకోవడానికి ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలో చదువుకోడానికి ఉచితం భోజనం,పుస్తకాలు ఏర్పాటు చేయడం జరిగినది. ప్రశాంతంగా ఉన్న గ్రామాలలో  వివిధ పార్టీ నాయకులు అలజడి సృష్టించడానికి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టడానికి గ్రామాలలో సోదర భావంతో విభేదాలు చిచ్చులు పెడుతూ కొత్త కొత్త వేషాలు వేసుకుంటూ వస్తున్నారు. వారి మాటలకు లొంగకుండా అప్రమత్తంగా ఉండాలి అని అన్నారు.మహిళలు కల్యాణ లక్ష్మి చెక్కులు తీసుకొని ముఖ్యమంత్రి,ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజారెడ్డి,సింగల్ విండో ఛైర్మన్ తిమ్మారెడ్డి,వైస్ ఎంపీపీ వీరన్న,మండలం పార్టీ అధ్యక్షుడు వెంకటన్న,సర్పంచ్ యాకోబ్, తహసిల్దార్ సరితా రాణి,ఎంపీడీవో కృష్ణయ్య, ఆలయం వ్యవస్థాపక చైర్మన్ ప్రహ్లాద రావు, వ్యవసాయ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ సవారన్న, గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు, కో ఆప్షన్ నెంబర్ హైదర్ సాబ్, తెరాస పార్టీ నాయకులు విక్రమ్ సింహారెడ్డి,అజయ్, తూం కృష్ణారెడ్డి, నరసింహారెడ్డి, భాస్కర్ ,ఆంజనేయులు, నరేందర్,మధు,చంద్రశేఖర్ రెడ్డి, భాస్కర్ గౌడ్,నారాయణ, మండలం యూత్ అధ్యక్షుడు ప్రవీణ్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.