అన్న ప్రసాద వితరణ చేసే వారు భాగ్యవంతులు

లయన్ డా. బాబురావు పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మందికి అన్నప్రసాద వితరణ.
జనగామ (జనగామ సాక్షి) జూలై 30: సమాజంలో ఆకలితో ఉన్న వారి బాధను తీర్చడానికి అన్న ప్రసాద వితరణ చేసే వారు భాగ్యవంతులు అని లయన్స్ ఇంటర్నేషనల్ 320ఎఫ్ జిల్లా గవర్నర్ కన్న పరశురాములు అన్నారు. లయన్స్ సంస్థలో నిధులు చేకూర్చే ఎల్. సి. ఐ.ఎఫ్. ఏరియా లీడర్ డా. ఘట్టమనేని బాబురావు పుట్టిన రోజు సందర్భంగా ఈరోజు తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్ష మందికి పైగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడా నికి ఆర్థిక సహాయం చేసిన బాబురావు దంపతులు భాగ్యవంతులు కన్నా కొనియాడారు. జిల్లాలోని రీజియన్ 1,2 లకు చెందిన క్లబ్ ల పక్షాన జనగామ ఆర్ టి సి చౌరస్తా వద్ద నిర్వహించిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని జిల్లా గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆకలితో ఉన్న వారికి పట్టెడన్నం పెట్టడం వల్ల లభించే సంతృప్తి వెలకట్టలేనిదని ఆలాంటి కార్యం చేసే ప్రతి ఒక్కరూ భాగ్యవతులే అని అన్నారు. 320ఎఫ్ పరిదిలో గల 8 రీజియన్ లలో సంయుక్తంగా పెద్ద ఎత్తున, అలాగే మరికొన్ని క్లబ్ లు స్వతహాగా ఈరోజు ఈ కార్యక్రమం నివహించినట్లు ఆయన తెలిపారు. ఇలాగే రాష్ట్ర వ్యాప్తంగా గల 7 లయన్స్ జిల్లాలలో గల లయన్స్ క్లబ్ లు డా. బాబు రావు మాతృ జిల్లా 320డి జిల్లా లో గల 144 క్లబ్ లు విడివిడిగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారని, ఇందుకు సహకరించి ప్రోత్సాహమిచ్చిన బాబూరావు కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రీజియన్ 1, 2 లలో గల  జనగామ, ఆబాద్, మిలీనియం, సూర్య, డైమండ్స్, సెంటీనియల్, శ్రీసాయి, ఒంసాయి, చేర్యాల, బచ్చన్నపెట, రఘునాథపల్లి, రాయల్స్, భద్రకాళి, కాళేశ్వరం, గోపాలపురం, దేవరుప్పుల, పాలకుర్తి, ముత్తారం క్లబ్ ల  సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో  రీజియన్ చైర్మన్లు దోర్నాల వేంకటేశ్వర్లు, గంగిషెట్టి ప్రమోద్ కుమార్ గుప్తా, జోన్ ఛైర్మన్లు ముస్త్యాల అరుణ, జిల్లా రాజేశ్వర్ రావు, జిల్లా క్యాబినేట్ కార్యదర్శి నాగబండి రవీందర్, కోశాధికారి అల్లాడి ప్రభాకర్ రావు, జిల్లా గవర్నర్ లియాజన్ ఆఫిసర్ క్రిష్ణ జీవన్ బజాజ్, జిల్లా నాయకులు ముస్థ్యాల బాల నరసయ్య, ఏ. నర్సిరెడ్డి, మార్యాల అశోక్, టి. వేంకట నారాయణ క్లబ్ ల నాయకులు బచ్చు రమేష్, కుతాటి ఉప్పలయ్య, పి. వెంకట్ రెడ్డి, గందే వేణు, కురెల్లి ఉపేందర్, కే. సురేందర్,  మేడ పూర్ణచందర్, గునకాల రవీందర్ రెడ్డి, పుర్మ మల్లారెడ్డి చీల చంద్రశేఖర్, బానోత్ రవి నాయక్, మేటి లక్ష్మయ్య, గట్టు రాధాకృష్ణ, రేణుకుంట కృష్ణ, చిదురాల బాబు, సముద్రాల సందీప్, దుడుక పూర్ణచందర్, జి. కిషోర్ తదితరులు పాల్గొన్నారు.