అఫ్ఘాన్‌లో తాలిబన్ల పట్టు


భారత్‌ బహుమతిగా ఇచ్చిన హెలికాప్టర్‌ స్వాధీనం
కాబూల్‌,అగస్టు12(జనం సాక్షి): ఆఫ్ఘనిస్థాన్‌ దళాలకు భారత దేశం బహుమతిగా ఇచ్చిన యుద్ధ హెలికాప్టర్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ హెలికాప్టర్‌ ముందు నిలబడి పోజులిస్తూ ఫొటోలు తీసుకుంటున్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లోని కుండూజ్‌ నుంచి వచ్చిన వీడియోలు, ఫొటోలలో ఎంఐ`24 యుద్ధ హెలికాప్టర్‌ పక్కన తాలిబన్లు నిలబడి కనిపిస్తున్నారు. దీనిని ఆప్ఘనిస్థాన్‌ దళాలకు భారత దేశం బహుమతిగా ఇచ్చింది. అయితే ఈ హెలికాప్టర్‌ను తాలిబన్లు ఉపయోగించడానికి వీల్లేకుండా, దాని రోటార్‌ బ్లేడ్లను ఆఫ్ఘన్‌ దళాలు తొలగించినట్లు తెలుస్తోంది. ఎంఐ`24 అటాక్‌ హెలికాప్టర్‌ను, మూడు చీతా లైట్‌ యుటిలిటీ హెలికాప్టర్లను 2019లో ఆఫ్ఘన్‌ వాయు సేనకు భారత ప్రభుత్వం బహుమతిగా ఇచ్చింది. ఇదిలావుండగా, ఆఫ్ఘనిస్థాన్‌లో 65 శాతం మేరకు తాలిబన్ల నియంత్రణలోకి వచ్చినట్లు తెలుస్తోంది.