అభిమాన నాయకుని పుట్టినరోజు సందర్భంగా 18 మంది కార్యకర్తల అవయవ దానము

రుద్రూర్(జనంసాక్షి):
ఉమ్మడి జిల్లాల డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా బాన్సువాడ నియోజకవర్గంలోని అన్ని మండలల్లో తమ అభిమాన నాయకుని పుట్టిన రోజు వేడుకలను తెరాస నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రుద్రూర్ మండల కేంద్రంలోని అక్బర్ నగర్ గ్రామం వద్ద తెరాస మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు
పుష్ప గుచ్చలతో, బాణా సంచాలతో స్వాగతం పలికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం, అక్బర్ నగర్ లోని సంస్కార్ ప్రకృతి చికిత్సాలయం లో లయన్స్ క్లబ్ ఆఫ్ భవాని వారు మరియు రుద్రూర్ మండల తెరాస నాయకుల ఆధ్వర్యంలో అవయవ దాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ ప్రియతమ నాయకుని కోసం తమ కుటుంబ సభ్యులను కూడా సంప్రదించకుండా ఏకంగా 18 మంది యువకులు వారి అవయవదానానికి తమ ప్రియతమ నాయకుని సమక్షంలో సంతకం చేశారు. ఈ సందర్భంగా పోచారం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అవయవ దానం చాలా గొప్పదని తన పుట్టిన రోజు సందర్భంగా 18 మంది యువకులు అవయవ దానం చేయడానికి ముందుకు వచ్చిన కార్యకర్తలను అభినందించారు. ఆ 18 మంది కార్యకర్తల అభిమానానికి తానెప్పుడూ రుణపడి ఉంటానని, వారి చేసిన అవయవదానం గురించి ఎంత చెప్పినా తక్కువే నని అన్నారు. తన తండ్రి సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు వేడుకలలో తానే మొదటి అవయవ దానం చేస్తానని తెలిపారు. అవయవ దానం చేసిన వారి వివరాలు సంజీవులు, (అడప నవీన్ రుద్రూర్ ), శంకర్, రామాగౌడ్, అశోక్ గౌడ్ ,రఘు, పద్మావతి, లక్ష్మీ, సత్యనారాయణ, గగన్, విజయ ,శంకర్, సత్యనారాయణ ,దర్శన్, రాజు ,మీరాజ్, మొహమ్మద్, సంతోష్ ఈ కార్యక్రమంలో
జడ్పిటిసి నారోజీ గంగారాం, ఎంపిపి అక్కపల్లి సుజాత నాగేందర్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అక్కపల్లి నాగేందర్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పత్తి లక్ష్మణ్, మాజీ సొసైటీ చైర్మన్ పత్తి రాము, ఎంపీటీసీ పత్తి సావిత్రి, టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బాల్ రాజ్, గ్రామ అధ్యక్షులు తోట్ల చిన్న గంగారాం, సొసైటీ చైర్మన్ బద్దం సంజీవరెడ్డి, మండల యువజన అద్యక్షులు కన్నెరవి, మాజీ ఎఎంసి చైర్మన్ బందెల సంజీవులు, రైతు సమన్వయ సమితి అద్యక్షులు తోట సంగయ్య, అడపా నవీన , పత్తి నవీన్, క్లిక్ రవి, ఎఎంసి డైరెక్టర్ రామ గౌడ్, అంజయ్య, కో ఆప్షన్ మెంబర్ మస్తాన్, లాల్ మొహమ్మద్, జమీల్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు