అభివృద్దికి విఘాతం కాంగ్రెస్,టిడిపిల పొత్తు
వారిని నమ్మితే తెలంగాణను నట్టేట ముంచుతారు
మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్
మహబూబాబాద్,నవంబర్3(జనంసాక్షి): టీడీపీ,కాంగ్రెస్‌ల పొత్తు తెలంగాణ అభివృద్దికి విఘాతమని మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ అన్నారు. తెలంగాణ ప్రాంతంలో టీడీపీ పూర్తిగా ఖాళీ అయి పోయిందని, దానికి జవసత్వాలు పోసేందుకు కాంగ్రెస్ నాయకులు ఆరాటపడుతున్నారన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌తో మిలాఖత్ కావడం దేనికి సంకేతమన్నారు. ఇది పక్కా అవకాశవాద రాజకీయం తప్ప మరోటి కాదన్నారు. కేసీఆర్‌ను ఒంటరిగా ఎదుర్కోనే సత్తా లేకే మహాకూటమి పేరుతో శత్రువులంతా మిత్రులై తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారన్నారు. ఖమ్మం జిల్లాలోని సీతారాం ప్రాజెక్టు కాళేశ్వరంపై కేసులు వేసిన ఘనుడు చంద్రబాబు అని, అలాంటి ద్రోహులతో కాంగ్రెస్ నాయకులు ఎలా పొత్తుపెట్టుకుంటారని ప్రశ్నించారు. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రాంత అభివృద్ది గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత టీఆర్‌ఎస్ పార్టీకే దక్కుతుందన్నారు.శనివారం నాడిక్కడ ఆయన విూడియాతో మాట్లాడుతూ కెసిఆర్ మాత్రమే తెలంగాణ అభివృద్దికి కంకణం కట్టుకున్న నాయకుడన్నారు. కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తి పోసిన చంద్రబాబు నాయుడు నాలుగు సీట్ల కోసం మహాకూటమిని బిచ్చమెత్తుకుంటున్నారని విమర్శించారు. కిందకే వస్తామనడంతో 12 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి నివేదించామన్నారు. గిరిజన బతుకులు మారాలంటే కేసీఆర్ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతాయన్నారు. గిరిజనులకు 12శాతం రిజర్వేషన్‌ల కోసం పార్లమెంట్‌లో పోరాటం చేస్తున్నామన్నారు. రిజర్వేషన్ పక్రియ కేంద్రం ఆధీనంలో ఉందనీ, కేంద్ర ప్రభుత్వం ఆ మోదం పొందితే 12శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని తెలిపారు.