అభివృద్దిని చూసి టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారు


వారందరికి అండగా ఉంటామన్న ఆరూరి
మళ్లీ టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఖాయమని వెల్లడి
వరంగల్‌ రూరల్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): రాష్ట ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది చూసి పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నారని వర్ధన్నపేట తాజా మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి అరూరి రమేష్‌ అన్నారు. రానున్న ఎన్నికల్లో ఆర్‌ఎస్‌ పార్టీ మరోమారు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అరూరి రమేష్‌ అన్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా వర్ధన్నపేట మండల పరిధిలోని కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి మాజీ ఎంపీపీలు, భద్రాద్రి, కాడరిగూడెం మాజీ సర్పంచ్‌ తో పాటు వార్డు సభ్యులు వ్యవసాయ మార్కెట్‌ చైర్మన్‌, ఐనవోలు గుడి మాజీ చైర్మన్‌ ఆధ్వర్యంలో 600 మంది కార్యకర్తలు అరూరి రమేష్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ పార్టీలో ఉన్న కార్యకర్తలను కంటికి రెప్పల కాపాడుకుంటానన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలో అందరూ కార్యకర్తలు పార్టీ గెలుపునకు కృషి చేయాలని వారు సూచించారు. రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన అన్నారు.పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని  రమేశ్‌ అన్నారు. ఐదేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలకు తనవంతుగా సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో కూడా పార్టీ అధినేత కేసీఆర్‌ సహకారంతో పూర్తిస్థాయిలో కార్యకర్తలు,
నాయకుల సంక్షేమం కోసం పనిచేస్తానన్నారు. ప్రధానంగా గత ఎన్నికల్లో తనకు 87 వేల ఓట్ల భారీ మెజార్టీ వచ్చేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంతో కృషి చేశారన్నారు. అలాగే డిసెంబర్‌ 7న జరిగే ఎన్నికల్లో కూడా మరింత మెజార్టీ వచ్చేందుకు కృషి చేయాలని కోరారు. ఇందు కోసం నాయకులు, కార్యకర్తలు ఉమ్మడిగా నిబద్ధతతో పనిచేయాలని కోరారు.