అభివృద్దిలో ముందుకు సాగుతున్న తెలంగాణ


ఆజాదీకా అమృత్‌ మహోత్సవంలో మంత్రి పువ్వాడ
ఖమ్మం,ఆగస్ట్‌21(జనంసాక్షి): నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ అభివృద్ధి
దిశగా ముందుకు సాగాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. అభివృద్దిలో తెలంగాణ ముందుకు సాగుతోందన్నారు. ఖమ్మం జడ్పీ హాల్‌లో శనివారం పంచాయతీరాజ్‌ విభాగం ఆధ్వర్యంలో ఆజాదీకా అమృత్‌ మహోత్సవం కార్యక్రమాన్ని ఎంపీ నామా నాగేశ్వర్‌రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి గ్రావిూణ సడక్‌యోజనపై నిర్వహించిన సెమినార్‌లో ఆయన మాట్లాడుతూ గతంతో పోలిస్తే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం రోడ్ల విస్తరణకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. రోడ్లు బాగుంటేనే రవాణా సౌకర్యం మెరుగై గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు.
రోడ్లు, భవనాల నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే ఫలితం దక్కదన్నారు. ఇంజినీర్లు నాణ్యతా ప్రమాణాలకే ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అందుబాటులోకి వస్తున్న కొత్త టెక్నాలజీని ఇంజినీర్లు అందిపుచ్చుకోవాలన్నారు. నూతన టెక్నాలజీ ద్వారా రోడ్లు వేయడంతో 15 నుంచి 20 శాతం వరకు అన్ని రకాలుగా ఆదా అవుతుందని మంత్రి తెలిపారు. గతంలో ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలంలో గ్రాన్యులర్‌ సబ్‌ బేస్‌ టెక్నాలజీతో 426 రోడ్లు రూ.2 కోట్ల నిర్మించినట్లు చెప్పారు. అలాంటి పద్ధతులను అవలంభిస్తూ రోడ్లు వేసుకోవాలన్నారు. మోదీ ప్రధాని అయ్యాక పీఎంజీఎస్‌వైని నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ఒక్కో నియోజకవర్గంలో 25 కిలోవిూటర్లు కూడా సరిగా ఇవ్వలేకపోయిందన్నారు. జిల్లాల్లో వేయాల్సిన గ్రావిూణ రోడ్లు వేల కిలోవిూటర్లు ఉన్నాయని, వాటిపై కేంద్రం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుందన్నారు. ఖమ్మానికి పూర్తిగా అన్యాయం జరిగిందని, రాష్టాన్ని అభివృద్ధి చేశామని చెప్పుకుని కేంద్ర మంత్రులు పాదయాత్రలు చేస్తున్నారని విమర్శించారు. గడచిన ఏడేళ్లలో తెలంగాణ ప్రభుత్వం సహకారంతో వేల కిలోవిూటర్ల రోడ్లు వేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌ రాజ్‌, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ సీతారాం, ఈఈ చంద్రమౌళి ఉన్నారు.