అభివృద్ది లక్ష్యంగా ఎమ్మెల్యే కృషి

భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌15(జనంసాక్షి): గతకొన్నిరోజులుగా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పలు గ్రామాల్లో తిరుగుతూ అనేక కార్యక్రమాల్లో పాల్గొటున్నారు. అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారు. సీసీరోడ్ల అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు నిర్వహించారు.ప్రతి గ్రామాన్ని సమస్యలు లేని గ్రామాలుగా తీర్చి దిద్దుతానని, అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తాన అన్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ ఎమ్మెల్యే నిధుల నుంచి నిర్మించ తలపెట్టిన సీసీరోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు నిర్వహించారు. అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని పేర్కొన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుంచుతానన్నారు. ప్రతి గ్రామంలో ఎక్కడ చూసిన సీసీరోడ్లు కనపడేలా పక్కా రోడ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. అభివృద్ధి విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. ఇదిలావుంటే అభివృద్దిలో అశ్వారావుపేట నియోజకవర్గాన్ని నెంబర్‌వన్‌ స్థానంలో నిలబెడుతున్నట్లు అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అన్నారు. ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని వాటిని పట్టించుకోనని అన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తున్న తీరును తట్టుకోలేక కాంగ్రెస్‌, వైసీపీ, టీడీపీ నాయకులు కలసి తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని ఆయన ఆరోపించారు.