మునీర్ కుటుంబానికి అండగా ఉంటాం : ఐజేయు, టీయుడబ్ల్యూజే

హైదరాబాద్, మే 20 (జనంసాక్షి) : సీనియర్ పాత్రికేయుడు, ప్రజాస్వామికవాది, తెలంగాణ ఉద్యమకారుడు మునీర్ హఠాత్తుగా అనారోగ్యానికి గురికావడం బాధాకరమని, ఆయన కుటుంబానికి తాము అండగా ఉంటామని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయు) జాతీయ అధ్యక్షులు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే.విరాహత్ అలీ, కే.రాంనారాయణలు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. మునీర్ చికిత్స ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ప్రకటించడాన్ని తాము స్వాగతిస్తున్నట్లు వారు తెలిపారు. మునీర్ కుటుంబం ఆందోళన చెందవద్దని, అన్ని విధాలా వారికి తమ సంఘం చేయూతనిస్తుందని వారు భరోసా ఇచ్చారు.

తాజావార్తలు