అభివృద్ధిలో మీడియా భాగస్వామ్యం అవసరం

4

– భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌

హైదరాబాద్‌,మే8(జనంసాక్షి):ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి చేరడంలో విూడియా సహకారం అవసరమని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు చేరాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. హైదరాబాద్‌ జలసౌధలో జరిగిన మిషన్‌ కాకతీయ విూడియా అవార్డుల ప్రధానోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. పలువురు ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ విూడియా ప్రతినిధులకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. కరీంనగర్‌ టీ న్యూస్‌ ప్రతినిధి వేణుగోపాల్‌ రావు? మంత్రి చేతుల విూదుగా అవార్డు తీసుకున్నారు.

రైతులకు నష్టం జరగకుండా చూడండి

వడగండ్లు, అకాల వర్షాలతో పలుచోట్ల వ్యవసాయ మార్కెట్‌ యార్డులలో ధాన్యం, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు తడిసిపోతున్నట్లు వార్తా కథనాలు వస్తుండడం పట్ల మార్కెటింగ్‌ అధికార యంత్రాగం పనితీరుపై మార్కెటింగ్‌ మంత్రి హరీష్‌ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది రైతు ప్రభుత్వమని, రైతులకు నష్టం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతుల నుంచి ఫిర్యాదులు రాకుండా చూడాలని అన్నారు. మార్కెట్‌ యార్డులలోని షెడ్లలో పంటలు నిల్వ ఉంచేలా చూడాలన్నారు. ధాన్యంపై టార్పాలిన్‌ లు కప్పి వుంచాలని చెప్పారు. ప్రభుత్వం తలపెట్టిన 330 గోదాములను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మార్కెటింగ్‌ శాఖ పనితీరుపై మంత్రి హరీష్‌ రావు సచివాలయంలో ఇవాళ సుదీర్ఘంగా సవిూక్షించారు.ఈ నెల చివరికల్లా 165 గోదాములు పూర్తి చేయాలని, ఆగస్టు 15 కల్లా మిగతా గోదాములు నిర్మించాలని మంత్రి డెడ్‌ లైను విధించారు. ప్రస్తుతం 100 గోదాముల నిర్మాణం చివరిదశలో ఉన్నట్టు అధికారులు మంత్రికి వివరించారు. జిల్లాల వారీగా చేపట్టిన వ్యవసాయ గోదాముల నిర్మాణాల పురోగతిని హరీష్‌ సవిూక్షించారు. విత్తనాలు, ఎరువులు నిల్వ ఉంచే ప్రాంతాల్లో గోదాముల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్యాలని ఆయన సూచించారు. గోదాముల నిర్మాణం పై ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఎంతో పట్టుదలతో ఉన్నారని మంత్రి గుర్తుచేశారు. మార్కెటింగ్‌ శాఖ గౌరవాన్ని, ప్రతిష్టను కాపాడాలని కోరారు.తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవడానికి, మార్కెట్‌ ఒడిదుడుకుల నేపథ్యంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టినట్లు మంత్రి వివరించారు. రూ. 1024 కోట్ల వ్యయంతో 330 గోదాములను 17.07 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్ధ్యంతో నిర్మిస్తోందన్నారు. ఈ గోదాముల నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తిచేసి ఖరీఫ్‌ సీజన్లో రైతులకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఐతే, గోదాముల నిర్మాణ పనులు నెమ్మదిగా నడుస్తున్నాయని మంత్రి హరీష్‌ రావు అన్నారు.ఈ సమావేశంలో రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌, గిడ్డంగుల సంస్థ ఎం.డి. శరత్‌ తదితర అధికారులు పాల్గొన్నారు.