అభివృద్ధి – నిర్వాసితులు

(సోమవారం సంచిక తరువాయిభాగం)
వాళ్లు ఇప్పుడు  తమ సాంప్రదాయికా ఆర్థిక వ్యవ ్థకూ చెందరు. కొత్తగా తలెత్తుతున్న ఆధునిక వ్యవ స్థకూ చెందరు. వాళ్లు తమదైన ఒక సొంత ఆర్థిక స్థలం లేని, తమకు తాము తగినట్టుగా నడు చుకో లేని స్థితిలో మిగిలిపోయారు. ఈ కారణం వల్లనే వారిని ‘మిగులు మనుషులు’ అనే పర్యాయపదంతో పిలవవలసి వస్తోంది. వారిని కొత్త వాతవరణంలో నిలిపి ఉంచేందుకు రాజ్యం అనేక రకాల సబ్సిడీ లద్వారా, సంక్షేమ పథకాల ద్వారా అంతకంతకూ ఎక్కువ నిధులు వెచ్చించే వ్యూహాత్మకమైన బాధ్యత తీసుకుంటోంది. కాని కొత్త ఆర్థిక వ్యవస్థలో వారిని పునస్సమ్మేళనం చేసే ఆలోచనే దానికి లేదు. ఆర్థిక కర్తలుగా వ్యహరించే తమ సొంత ఆర్థిక స్థలం లేనందువల్ల ఒక వంక, ఏ పనీ చేయకపోయినా రాజ్యం క్రమ బద్ధంగా అందజేసే తాయిలాల వల్ల మరొకవంక వారిలో ఇతరు లపై ఆధారపడి ఉండే మానసికస్థితి తలెత్తింది. ఈ మనసిక స్థితి వల్ల వాళ్లు క్రియాశీల మానవులుగా, కర్తలుగా తమ పాత్ర నిర్వ హించలేని స్థితి ఏర్పడింది. వారిని ఎల్లప్పుడూ ఎవరో ఏదో ఇస్తే స్వీకరించే లబ్ధిదార్ల స్థితికి పరిమితం చేసింది. ఇది ఎల్లప్పుడూ తమ సమస్యల పరిష్కారానికి భగవంతుడు అనే మానవాతీతశక్తి మీద ఆధారపడే లాంటి మానసిక స్థితే. ఈ నిర్వాసిత ప్రజలు తమ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం వైపో, నాయకుడి వైపో చూస్తూ ఆధారపడే మనస్తత్వాన్ని చూపుతున్నారు. మరోమాటల్లో చెప్పాలంటే ఆ మిగులు మనషులు తమ సొంత చొరవనంతా కోల్పోయి నిర్లిప్త వస్తువుల స్థాయికి కుదించబడి ఉన్నారు. దేశానికి ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే వారికి తమ ఉనికి గురించిన స్పృహ కలుగుతుంది. వారి వోటుకు ఒక పాత్ర ఉంటుంది. ఈ పరాశ్రిత మనుగడకు ప్రతీకాత్మక చిత్రంగా ఎల్లప్పుడూ చేతులు ముడుచుకుని ఆకాశం వైపు ఎదురుచూపులు చూస్తుండే నిస్సహాయ జీవులను చూడవచ్చు.ఈ నిర్వాసితులలో కొందరు, నిర్దిష్ట నియమ నిబంధనలు లేని తమదైన ప్రత్యేక ఆర్థిక స్థలమేదీ లేనందువల్ల సంఘ వ్యతిరేక శక్తులుగా కూడ మారుతారు. అసాంఘిక కార్యకలాపాలలో పాలుపం చుకుంటారు. పౌరసమాజ నియ మాలను చెల్లాచెదురు చేస్తారు. తాము నివసిస్తున్న ఆర్ధిక వ్యవస్థను అస్థిరపరుస్తారు. నిర్వా సితులలో మరొక పాయ రాజ్యాన్ని దాని అభివృద్ధి విధానాలను సవాలు చేసే విప్లవోద్యమాలలో చేరుతారు. ఈ అన్ని బృందా లలోను, పరాశ్రిత మునుగడలో ఉండే నిర్వాసి తులు సమాజంలో మార్పుకు ప్రధాన ఆటంకంగా ఉంటారు. వారిని నిశితండి పరిశీ లిస్తే వారు తమ స్వీయ అస్తిత్వ ఆలోచనా ఆచరణా స్థలం ఏమిటో తెలియని స్థితిలో, ఆర్థిక వ్యవస్థ నిర్మా ణాలతో సంబంధం లేని స్థితిలో ఉంటారని అనిపిస్తుంది. వ్యవస్థలో ఒక ప్రత్యేక ఉత్పత్తి వనరు కొరతతో ఉందనే భావన, ఆ వ్యవస్థకు నిర్మాన సూత్రా లుంటాయనే భావన వారిలో అస్ప ష్టంగా ఉంటాయి లేదా ఉందవు. ఆ క్రమంలో ఈ నిర్వాసిత ప్రజలు తమ చైతన్యాన్ని కోల్పోతారు. వ్యవస్థనుంచి పరాయి అయిపో తారు. వారు భౌతి కంగా కొత్త కారు. వారు ప్రభుత్వం నుంచి ఇంకా ఇంకా ఎక్కువ తాయి లాలు వస్తాయని ఆశిస్తారు, రావాలని కోరు తారు. స్వీయ అస్తిత్వ ఆలో చనా ఆచరణా స్థలం లో కొరత అనే భవన దాదాపుగా కొరవ డినం దువల్ల, వీరు తాయిలాల కొరత అనే భావనతో ఉచితంగా తమకు అందేవాటిని ఇంకా ఇంకా సంపాదించాలని ఆశపడతారు. అది అవి నీతికి భావజాల పునాదిని సంతరించి పెడుతుంది. ఇంకా ఇంకా ఎక్కువ తాయిలాలు కావాలనే వారి కోరిక రాజ్యం తన ఆర్థికవనరులను ఇంకా ఎక్కు వగా వెచ్చించడానికి దారితీస్తుంది. ఈ కోరికల ఆ టంకాలను తొలగించడం ద్వారా తాను కోరుకున్న అభివృద్ధి ప్రక్రియకు అవసరమైన పెట్టుబడుల ప్రవాహం సాఫీగా సాగిపోవాలని రాజ్యం కోరు కుంటుంది. నిర్వాసిత ప్రజలు తమకు వీలయినంత ఎక్కువ కావాలని కోరడం, సాధించడానికి ప్రయ త్నించడం వల్ల రాజ్యం మీద భరించరాని భరించరాని భారం పడు తుంది.

ముగింపు

నిర్వాసితులు, అంచులలోకి నెట్టబడినవారి

– ముదునూరి భారతి

(మిగతా రేపటి సంచికలో…

వీక్షణం సౌజన్యంతో…)