అభివృద్ధి – నిర్వాసితులు

ముగింపు
నిర్వాసితులు, అంచులలోకి  నెట్టబట్టినవారి జనా భా ఉండడం, అంతకంతకూ పెరిగిపోవడం, వారు ఆధునిక వ్యవస్థలోకి సంలీనం కాకపోవడం సమా జం మీద గణనీయమైన ప్రభావం వేస్తాయి. ఈ స్థితి సమాజపు పురోగమనానికి, అంటే సాంప్రదా యిక వ్యవస్థ ఆధునిక వ్యవస్థగా అభివృద్ది చెందడా నికి అవరోధాలను కలగజేస్తుంది.ఆర్థికవ్యవస్థలో ‘అభివృద్ధి పథకాల ద్వారా అభివృద్ధి’ అనే మార్గం భారత ఆర్థిక వ్యవస్థను ప్రత్యేకంగా గుర్తించదగిన. సహజీవనం చేస్తున్నమూడు విభిన్న ఉపవ్యవస్థల సమాహారంగా మార్చివేసింది.ఈక్రమంలొ అవశే షంగా మిగిలిపోవలసిన  గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అందుకు బదులుగా ప్రస్తుతం రెండు విభిన్న మైన,స్వతంత్రమైన సజీవమైన ఆర్థికవ్యవస్థలుగా కనపడుతోంది. ఈపరిస్థితిలో ఒకేఒక్క పరివర్తనకు ఏకైక దిశగాని ఒకేఒక్క పరివర్తనావిధానం గాని ఉండే అవకాశం లేకపోవచ్చు, అలాగే మూడు ఉప వ్యవస్థల మధ్య ఏకముఖ సంబంధాలు ఉండడం వల్ల అంతరాల దొంతరలో పైస్థానాన్ని  పెట్టుబడి కొరత వ్యవస్థ ఆక్రమించి ఉంది, అదే విశాల ఆర్థిక వ్యవస్థమీద ప్రాభల్యం వహిస్తుంది,అది ఇతర వ్యవస్థలతో దోపిడి, పీడన సంబంధాలను నెరపుతోంది.
ఈ మూడు ఉపవ్యవస్థలు మూడు భిన్నమైన స్వీయ అస్తిత్వ ఆలోచనా ఆచరణా స్థలాలను సృష్టిస్తాయి. ఆ స్థలాలలో ఉన్న వ్య క్తులు మూడు భిన్నమైన చైతన్య స్థాయిలను కలిగి ఉంటారు. మూ డు భిన్నమైన ఉప ఆర్థిక వ్యవస్థల సమకాలిక ఉనికి, అవి విభిన్న దిశలలో అమలుచేసే బహుళ ఒత్తిళ్లు, అదేసమయంలో ఏకముఖ సంబంధాలు ఉండడం వల్ల మొత్తంగా వ్యవస్థ సమతాస్థితిని కోల్పో తుంది. ఇటువంటి బహుస్వభావ ఆర్థిక వ్యవస్థలోకి మరింత పెట్టు బడి మదుపు ప్రవేశిస్తే ఉప ఆర్థిక వ్యవస్థల మధ్య విభజన పెర గడం, అస్థిరతను సృష్టించడం మాత్రమే జరుగుతాయి. ఈ అభివృ ద్ధి పథకాల పట్ల నిర్వాసిత ప్రజల స్పందన పూర్తి వ్యతిరేకతగానో, ఎక్కువ ప్రయోజనాల కొరకు బేరంగానో ఉంటుంది. దీని ప్రభావం ఎంత బలంగా ఉంటుందంటే అభివృద్ధి పథకాల అంచనావ్యయం మధ్యదారిలో పెరిగిపోతుంది. అనిశ్చితి పెరుగుతుంది.
ఇక రాజ్యం పనితీరు రంగంలో ప్రభుత్వాలు పెట్టుబడి మదు పును ఆకర్షించే ప్రయత్నంలో వర్ధమాన ఆర్థిక వ్యవస్థలోకి పెట్టుబ డుల సాఫీ ప్రవాహం కొరకు మంచి మౌలిక సాధన సంపత్తిని కల్పించవలసి ఉంటుంది. అలాగే రాజ్యమే తగిన నష్టపరిహారం ఇవ్వవలసి ఉంటుంది. పున:స్థిరీకరణ, పునరావాస సహాయం అందజేయవలసి ఉంటుంది. ఇదంతా డబ్బు రూపంలో ఇవ్వడం మాత్రమే కాదు. మార్కెట్‌ ధరతో ఎక్కువ నష్టపరిహారాన్ని ఇవ్వాలని కోరే నిర్వాసితులను సంతృప్తి పరచడానికి ప్రభుత్వం ఇంకా ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఇదంతా ఎటువంటి ఫలితం లేని ఆర్థిక అనుత్పాదక వ్యయంగా మారిపోతుంది. ప్రవహిస్తున్న నదిలోకి నాణాలు విసిరేసినట్టుగా అది ఎందుకూ పనికి రాకుండా పోతుంది. అంతేకాదు, ‘సమ్మిళిత అభివృద్ధి పథకాలు’ అనే పేరుతో ప్రభుత్వం ప్రచారం చేస్తున్న పథకాలేవీ ఈ అంచులలో ఉన్న ప్రజానీకాన్ని వ్యవస్థలో సమ్మిళితం చేయలేక పోతున్నాయి. దానికి తోడుగా, దేశ వ్యాప్తంగా ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి పథ కాలకు వ్యతిరేకంగా సాగుతున్న రాజకీయ ఉద్యమాలను అణచి వేయడానికి రాజ్యం అనేక రకాల అదనపు ఖర్చ కూడ భరించ వలసిన వస్తోంది.పెట్టుబడి మదుపు పెరిగే తొలిదశలో అది ఆర్థిక వ్యవస్థ మొత్తంగా పెరుగుదలకు దారి తీసి ఉండవచ్చును. కాని కా లక్రమంలో ఈ వృద్ధి తగ్గుముఖం పట్టింది. చివరికి దాని ఫలితంగా ఎటువంటి పరివర్తనా రాలేదు. ప్రస్తుతం రాజ్యం ఆర్థిక వ్యవస్థలోకి ఇంకా పెట్టుబడి మదుపును ఆకర్షించాలని ఆశిస్తూ మరోసారి  సం స్కరణలకు పూనుకుంటోంది. చిల్లర వర్తకం, విమానయానం, బీమా, తదితర రంగాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని ఆహ్వా నించడానికి ప్రయత్నిస్తోంది. అదే సమయంలో వేలాది కోట్ల రూపా యలు ఖర్చుతో సాంఘిక సంక్షేమ వ్యయాన్ని పెంచడానికి ప్రతిపాది స్తోంది. అలాగే కంపెనీలు తమకు అప్పగించిన భూమి మీద ఎటు వంటి కార్యక్రమాలు చేపట్టడానికి వీలులేని విధంగా ఆటంకాలు ఎదుర్కొంటున్నప్పటికీ ఆ భూమిని వెనక్కి ఇవ్వకుండా తమ అధీనం లోనే ఉంచుకోవడం మరొక అంశం. అలాగే సమాజంలో పెరిగి పోతున్న మరొక అంశం ఏమంటే ఇప్పటికీ ప్రజలు తమ దగ్గర డబ్బును బ్యాంకుల లాంటి సంస్థలలో మదుపు పెట్టకండా, భూమి మీద పెట్టడానికే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. రాజకీయ నాయ కులు, ప్రభుత్వాధికారులు, పాలకులు, సంపన్నులు వందలాది ఎక రాల భూములు కొనుగోలు చేస్తున్నారు.
మారుతున్న ఆర్థిక నేపథ్యపు ఈ పరిస్థితిలో ఉన్న వాతావరణాన్ని చెప్పాలంటే
పారిశ్రామికవేత్తలు, గనుల కంపెనీల తమకు  అందిన భూమిని అంటిపెట్టుకుని ఉంటున్నారు.
– నిరుపేద ప్రజలు భూమి కోరుకుంటున్నారు.
– గ్రామీణ ప్రాంతాల భూయజమానులు తమ భూమి వదలడానికి సిద్ధంగా లేరు.
– రియల్‌ ఎస్టేట్‌ వంటి రూపాలలో భూమి మీద కొత్త పెట్టుబడి మదుపు వస్తోంది.
ఇప్పటికీ మిగులును సృష్టించేది భూమేననే, పెట్టుబడి కాదనే భావన ఈ పరిణామాకలతో బలోపేతం అవుతుంది.ఇక నిర్వాసితులైన ప్రజల గురించి చూస్తే, ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి ప్రక్రియ వారి మీద వేస్తున్న ప్రభావం ఆసక్తికరమైనది. ఈ ప్రక్రియ వల్ల నానాటికీ ఎక్కువమంది ప్రజలు తమ సాంప్రదాయిక వ్యవస్థల లోనూ ఉండలేకపోయారు.  ఆధునిక వ్యవస్థలోనూ సంలీనం కాల వకపోయారు. వారు తమంత తాముగా వ్యవహ రించి, తమ జీవ నోపాధి సంపాదించుకోగలిగిన ఆర్థిక వ్యవస్థలేవీ వారికి లేకుండా పోయాయి. అందువల్ల వారు సబ్సిడీలు, సంక్షేమ చర్యలు, సమ్మిళిత అభివృద్ధి కార్యక్రమాలు వంటి రూపాలలో ప్రభుత్వం ఇచ్చే తాయిలాల మీద ఆధారప డవలసిన స్థితికి నెట్టబడుతున్నారు. అంటే వారు  ‘తాయిలాల కొరత’ అనే భావనతో వ్యవహ రించ డానికి నెట్టబడి, తాము పొందే ఉచిత వస్తువు లను పెంచుకోవడమెలా అని ప్రయత్నిస్తున్నారు. ఇది అవినీతికి భావజాల పునాదిని కల్పిస్తోంది. సరైన నాయకత్వం, వ్యవస్థానిర్మాణాలలో మార్పు సహక రిస్తే నిర్వాసిత ప్రజలలోని ఒక చిన్న భాగం వారికి దొరికిన కొత్త స్థలంలో పున:స్థిరీకరణ, పున రావా సం పొందడం మాత్రమే కాదు, కొత్త వ్యవ స్థలో సంలీనమైపోతున్నారు. కాని నిర్వాసిత ప్రజ లలో అత్యధిక సంఖ్యాకులు ప్రభుత్వం ఇచ్చే తారు లాల మీద మాత్రమే ఆధారపడి, పరాన్నభుక్కు జీవి తం గడుపులున్నారు. రాజ్యం వారి సమస్యలు పరి ష్కరించే రక్షకురాలిగా కనబడుతోంది. కొన్నిసార్లు ఇలా ప్రభుత్వం మీద నిరంతర ఆశ్రితత్వం వల్ల, వారు సంఘవ్యతిరేక శక్తులుగా మారి, అసాంఘిక కార్యకలాపాలకు దిగుతున్నారు. మరికొందరు భవి ష్యత్తు మీద ఏ ఆశా లేని పరాశ్రిత మనుగడతో విరక్తి చెంది. రాజ్యాన్ని, పెట్టుబ డిదారీ అభివృద్ధి  మార్గాన్నీ వ్యతిరేకించే మౌలిక ఉద్యమాలలో భాగమవుతున్నారు.
పెట్టుబడిదారీ అభివృద్ధి పథానికి ఎదురవుతున్న ఈ ఆటంకాలను తొలగించే ప్రయత్నంలో ఈ నిర్వాసితులను శాంతింపజేయడానికి రాజ్యం వారికి నానాటికీ ఎక్కువ తాయిలాల ఆశ చూపవచ్చు. కొత్త పథకాలను ప్రకటించవచ్చు. వారు తమ సొంత చొరవను ప్రదర్శిం చకుండా పరాన్నభుక్కు జీవితమే కొనసాగించేటట్టు వారిని నెట్టవ చ్చు. అందువల్ల వారు క్రమంగా మనిషి సహజస్వభావాలైన ఆలోచ న. సృజనాత్మక ఆచరణల నుంచి దూరమవుతారు. ప్రభు త్వం ఇచ్చే తాయిలాలు ఎలా ఉన్నప్పటికీ, ఈ నిర్వాసిత ప్రజలు తమ సహజ మానవ స్వభావాన్ని తిరిగి సంపాదించుకునేందుకు, తమ దని చెప్పుకునే తమ మనుగడకు చాలినంత చిన్న మడిచెక్క కావాలని కోరుతారు. ఈ అంశానికి ఉదాహరణ ఇటీవల జరిగిన జన సత్యాగ్రాహం. దేశంలోని విభిన్న ప్రాంతాలకు చెందిన లక్ష మంది రైతులు గ్వాలియర్‌ నుంచి ఢిల్లీ దాకా ఊరేగింపుగా వెళ్లి తమదని చెప్పుకోగలిగే అతి చిన్న మడిచెక్క (పది సెట్లు) కావాలని ఆందోళన జరిపారు.
సారాంశంగా చెప్పాలంటే, భారతదేశంలో అభివృద్ధి కోసం ఎంచుకున్న పెట్టుబడిదారీ మార్గం అశేష ప్రజానీకాన్ని తమ సాంప్ర దాయిక ఆర్థికవ్యవస్థ నుంచి నిర్వాసితులను చేస్తోంది. వారు ఆధు నిక ఆర్థిక వ్యవస్థలో కూడ సమ్మిళితం కావడం లేదు. ఇలా అంచు లోకి నెట్టబడుతున్న ప్రజా సమూహం విస్తరిస్తున్న కొద్దీ సమాజం మీద దాని ప్రభావం పెరుగుతుంది. ఈ లంగరు స్వభావమేమంటే ఇది సమాజగమనం(అభివృద్ధి) పాక్షికంగా, పరిమితంగా సాగేందు కు మాత్రమే అనుమతిస్తుంది. అభివృద్ధిని కొత్తగా, విభిన్నంగా పున ర్నిర్మించి, పునరాలోచించి, మిగులు మనుషులను కొత్త వ్యవస్థలోకి పునస్సమ్మేళనం చేసే క్రమాన్ని మొదలుపెట్టకుండా, నిర్వాసితులకు ప్రధాన పాత్ర ఇవ్వకుండా, నిర్వాసితత్వం, అభివృద్ధి క్రమాలను ఐక్యం చేయకుండా సమాజ పరివర్తన వాస్తవరూపం ధరించదు.
– ముదునూరి భారతి
( వీక్షణం సౌజన్యంతో…)