అభివృద్ధి పథకాల వ్యతిరేక ఉద్యమాలు

అభివృద్ది పథకాల నిర్మాణం మొదలుపెట్టినప్పటి నుండి అత్యవసరమైన సమాజ అవసరాల కోసం 1894 భూసేకరణ చట్టాన్ని ఆధారంగా చేసుకొని బలప్రయోగం ద్వారా భూసేకరణ జరుగుతూనే ఉంది. స్థానిక ప్రజలు దీనికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. ఉదాహరణకు 1947లోనే హిరాకుడ్‌ డ్యాంకి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించారు. ఒడిశాలోని రెంగాలి డ్యాంకి వ్యతిరేకంగా జరిగని న్రపజా ఉద్యమం తీవ్రతరం కావడంలో మొట్టమొదటిసారిగా ఉద్యమకారుల మీద పోలీసులు కాల్పులు జరపడం, కొంతమంది చనిపోవడంతో ఉద్యమాలలో హింస పరిపాటిగా మారింది. పశ్చిమ బెంగాల్‌లో టాటా కంపెనీకి, సేలం కంపెనీకి వ్యతిరేకంగా సింగూరు, నందిగ్రాంలలో ఒడిశాలలో కళింగనగర్‌లో టాటా వారి ఉక్కు పరిశ్రమ, జగత్‌సింగ్‌పేర్‌లోని వేదాంత అల్యూమినియం కంపెనీ, పోస్కో ఉక్కు పరిశ్రమ, ఆంధ్రప్రదేశ్‌లో సోంపేట థర్మల్‌ ప్రాజెక్ట్‌ ఇలాంటివెన్నో కాకుండా ఢిల్లీకి సమీపంగా ఉండే గ్రేటర్‌ నోయిడాలోని రైతులు తమ భూములను చౌకగా సేకరించే విధానానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయడం, దానిని అణచివేసే ఆద్దేశ్యంతో పోలీసులు కాల్పులు జరపడంతో హింసాత్మకంగా మారిపోయింది. సింగూరు, నందిగ్రాంలలో బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం శక్తివంతమైన ప్రభావంతో రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడం, రాష్ట్రంలో అమలు చేయడానికి కొత్తగా ఏర్పడిన త్రిణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒక కొత్త భూసేకరణ చట్టం తయారు చేసింది. నోయిడా ఉద్యమం అనేక కారణాల మూలంగా రాజకీయ ప్రాముఖ్యత సంతరించుకుంది.

భూసేకరణ ఉద్యమాల గురించి ప్రాచుర్యుంలో ఉన్న అభిప్రాయ మేమిటంటే పథకాల వలనే ప్రభావిత ప్రజలు (వీరిని ప్రస్తుతం నిర్వాసితులనే అందాం)ఇప్పటికంటే ఎక్కువ నష్ట పరిహారం, ఇంకా ఇంకా లాభాల కోసం చేరమాడే దురాశాపరులుగా చిత్రింపబడుతున్నారు. దీనికి కారణం మన దేశంలో మార్కెట్‌ వ్యవస్థ పూర్తిగా రాని కారణంగా భూమికి అమ్మకం ధరని సరిగా నిర్ణయించడం జరగదనీ, మార్కెట్టు వ్యవస్థలో భూమి వినియోగ విధానాన్ని బటివ్ట దని ధర నిర్ణయింపబడుతుందనీ, బేరసారాల ద్వారానే భూమికి ఒక అమ్మకం ధర నిర్ణయించబడుతుం దనే అభిప్రాయం కూడా ఉంది. ఈ దృక్పథం కొంతవరకు నిజమని నొయిడా ఉదంతం చెబు తుంది. రైతుల ఉద్యమం రాజకీయంగా మారిన వెంటనే ప్రభుత్వం వారికిచ్చే నష్ట పరిహారాన్ని కొన్ని రేట్లు (అప్పట్లో ఆరు రేట్లుగా) పెంచడంతో ఉద్యమం తగ్గుముఖం పట్టింది. దీనికి  అనుబం ధంగానే ప్రభుత్వం అతి వేగంగా శతాబ్దకిపైగా అమలులో ఉన్న పాత భూసేకరణ చట్టాన్ని తొలగించి, దాని స్ధానంలో కొత్త చట్టాన్ని దేశంలో అన్ని ప్రాంతాలలో అమలు చేసే విధంగా అమలు చేసే విధంగా రూపొందించే ప్రయత్నం మొదలు పెట్టింది. ఈ ఉద్యమాలను దాని రూపం ద్వారా పరిశీలించితే (నొయిడాలో జరిగినట్లుగా) రైతులు మేలైన నష్టపరిహారం, ఇంకా మేలైన ఇతర లాభా ల కోసం చేసినట్లుగానే కనిపిస్తుంది. కాని దాని సారం పరిశీలించితే ఈ ఉద్యమాలు అభివృద్ది పథకాల మీద స్ధానిక ప్రజల వ్యతిరేకతకి (సింగూ రులో జరిగినట్లుగా) నిదర్శనాలవుతాయి. గత చరిత్ర వీరికి సూచించిన విషయాలేమిటంటే ఈ అభివృద్ది పథకాల ద్వారా జరిగే విధ్వంసంలో తా ము తమ జీవనాధారంతో పాటు తమ వనరుల్ని పోగొట్టుకుంటామని, కొత్త సమాజంలో తమకు స్ధానం దొరకడం కష్టమని ఉద్యమమొక్కటే దారి అని తెలుసుకున్నారు. దేశంలోఅభివృద్ది పథకాల కు వ్యతిరేకంగా వస్తున్న ఉద్యమాలు ప్రభుత్వాని కొక హెచ్చరికంగా, పథకాలు తమకు సరిపోవని, వాటిని సరిదిద్దవలసిన అవసరాన్ని గుర్త చేసుకు న్నట్లుగా చూడవచ్చును.ఈ రెండవ అభిప్రాయం మనకు చత్తీస్‌గడ్‌, జార్ఖ్‌ండ్‌, బీహార్‌, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ లాంటి రాష్ట్రాలలో కనిపిస్తుంది. మావోయిస్టుల తాత్విక సిద్దాంతం శ్రమ ఆధారిత అభివృద్ది కార్యక్రమం అయిన కారణంగా, ఈ రాష్ట్రాలలో జరుగుతున్న పెట్టుబడి ఆధారిత అభివృద్ది మార్గాలను వ్యతిరేకించడంతో హింస, ప్రతి హింసల క్రమం మొదలైంది. ఈ రాష్ట్రాల పారిశ్రామికీకరణ ప్రయత్నాలకుఅడ్డు తగలడంతో ఈ రాష్ట్రాలలో అస్థిరత్వం నెలకొంది.
ఈ మధ్యనే జరిగిన నొయిడాలోని రైతుల ఉద్య మం, ఇంకా చాలా కాలంగా కొనసాగుత్ను మవో యిస్టు ప్రభావిత రాష్ట్రాలలోని అభివృద్ది పథకాల వ్యతిరేక ఉద్యమం వాటితో వెన్నంటి ఉండే ఇం కొన్ని ఉద్యమాలు ఈ రెండింటి మూలాన వస్తున్న రాజకీయ ఒత్తిడులు కలిసి ఒక ట్రిగర్‌గా పనిచేయడం మొదలైంది. దాంతో ప్రభుత్వం మార్కెట్‌ సహాయం తీసుకుని భూమికి సరియైన ధరకు నిర్ణయించి, వారికి సంతృప్తికరంగా పునర్‌ నివాసం , పునస్థిరీకరణ(రిహాబిలిటేషన్‌ అండ్‌ రిసెటిల్మెంట్‌ ఆర్‌ అండ్‌ఆర్‌) పాలసీ రూపొంది చగలిగితే, ఈ భూసేకరణకి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయనీ, పారిశ్రామికీ కరణం అడ్డంకులేవీ ఉండవని ఆలోచించి 1894 భూసేకరణ చట్టం స్ధానంలో ఒక కొత్త భూసేకరణ చట్టాన్ని రూపొందించే కార్యక్రమానికి పూనుకుంది. గ్రామీణాభివౄద్ది శాఖకు మంత్రి అయిన జయరాం రమేష్‌ ఆధ్వర్యంలో కొత్త చట్టాన్ని కాలయాపనలు ఏమీ లేకుండా మెరుపు వేగంతో రూపొందించడమే కాకుండా, ప్రజలు దానిని చదివది స్పందించగలిగే విధంగా ఇంటర్నెట్‌లో పెట్టడం, తరువాత పార్లమెంట్‌లో బిల్లు రూపంలో ప్రవేశపెట్టడం, రాష్ట్ర ముఖ్యమంత్రులందరి సహకారాలు తీసుకోవడం, స్టాండింగ్‌ కమిటీలో ఒప్పందం కుదిరిన వెంటనే అది భూసేకరణ, పునర్‌ నివాసం, పునస్థిరీకరణ 2011(క్లుప్తంగా భూసేకరణ బిల్‌ 2011) పేరుతో దేశంలో అన్నీ చోట్లా వర్తింపచేసే విధంగా ప్రయత్నాలన్నీ జరగిపోయాయి.