అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే
పెద్దపల్లి గ్రామీణం: పెద్దపల్లి మండలం పెద్దబొంకూరులో రూ. 32 లక్షలతో చేపట్టనున్న మెటల్ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే రమణారావు ప్రారంభించారు. గ్రామంలో రూ.7.25 లక్షలతో నిర్మిస్తున్న రక్షిత మంచినీటి పథకానికి శంకుస్థాపన చేశారు.