అమరత్వానికి అటూ ఇటూ
రాజ్యం ఒకవైపు ఎన్‌కౌంటర్‌లకు పాల్పడుతూ,
మరోవైపు అబద్ధపు ప్రచారాలతో అమరుల త్యాగాలను మసకబార్చడానికి ప్రయత్నిస్తొందని అంటున్నారు. వరవరరావు
మైదాన ప్రాంత బుధ్ధి జీవుల ఆలో చనల్లో, చైతన్యంలో అడవి, ఆదివాసులు చోటు చేసుకోవడం చాలా కష్టసాధ్యమైన విషయం. అం దువల్ల వాళ్ల భూగోళం, చరిత్ర న్యాయంగా, కనీసం వాస్తవంగా నమోదు కావడం కూడా కని పించదు. ఇంద్రవెల్లి మరణకాండలో ఎంతమంది చనిపోయి, ఎంతమంది గాయపడ్డారో ఇప్పటికీ అధ్యయం, పరిశోధన చేసి మానవశాస్త్ర, సామా జిక శాస్త్రవేత్తలు తేల్చినట్లులేదు.
ఈ నెల 16వ తేదీన ఎన్‌కౌంటర్ జరిగిందని చెప్తున్న స్థలం సుకుమాజిల్లాలో వస్తుందా, బీజాపూర్ జిల్లాలో వస్తుందా ఆపరేషన్ గ్రీన్ హంట్ నిపుణులు కూడా చెప్పలేదు. మొదట గుర్తింపబడిన మృతదేహం కోసం ప్రయత్నిం చినప్పుడు గానీ అది సుకుమా జిల్లా పోలీస్‌స్టేషన్ కిందికి వస్తుందని స్పష్టం కాలేదు. ఒక్క బస్తర్ జిల్లా మావోయిస్టు ఉద్యమాన్ని, వాళ్ల నాయ కత్వంలో ఆదివాసి పోరాటాలను అణచివేసే క్రమంలో ఏడు జిల్లాలుగా వికేంద్రీకరింపబడడం వల్ల పోలీసులకు జిల్లాల సరిహద్దులు తెలిసినంత సులభంగా రెవెన్యూ జిఆ్లలు తెలిసేట్లు లేవు. అయినా ఇదంతా అకడమిక్‌చర్చయేగానీ విప్లవా నికి సరిహద్దులు లేనట్లుగానే విప్లవాన్ని అణచే రాజ్యాంగ యంత్రానికి కూడా ఏ చట్టాల పరిమి తులు, నియమాలు లేవు, కిషన్‌జీ ఎన్‌కౌంటర్ కాలం నుంచి సర్కెన్‌గూడ(బాసగూడ)ఎన్‌కౌంటర్ దాకా ఆయా రాష్ట్రాల్లో సిఆర్‌పిఎఫ్ నాయ కత్వంలో గాలింపులు, ఏకపక్ష కాల్పులు విన్నాం. అప్పుడు వాటిన్నింటికీ కుఖ్యాతి వహించిన సిఆర్‌పిఎఫ్ డైరెక్టర్ జనరల్ విజయ్‌కుమార్ నాయకత్వం వహించాడు.
ఆయన రటైరయ్యాడు. ఈ సారి సుకుమా జిల్లా ఎన్‌కౌంటర్‌కు ఆంధ్రా గ్రేహౌండ్స్ నాయకత్వం వహించాడు. వాళ్ల నాయ కత్వంలోనే మూడు వైపుల నుంచి (చత్తీస్‌గడ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్) సిఆర్‌పిఎఫ్, కోయ కమాండోలు, తదితర అర్థసైనిక బలగాలు మూడువేల మంది ముట్టడించి దాడి చేశారని ఒక సమాచారం. ఈ దాడి సందర్భంలో మావోయి స్టుల శిబిరంలో ఇరవైనాలుగు మంది ఉన్నారని, అందులో కేంద్ర నాయకత్వం కటకం సుదర్శన్, మళ్ల రాజిరెడ్డితో సహా ఉత్తర తెలంగాణ బాధ్యుడు చంద్రన్న, ఇంకా హరిభూషణ్, బడేదామోదర్, కంకణాల రాజిరెడ్డి దాకా ఉండి ఉండే అవకాశం ఉందని, ఆ అగ్రనాయకత్వాన్ని కాపాడే క్రమం లోనే పోరాడుతూ ఈ తొమ్మిదిమంది అమరు లయ్యారని, మిగతా వాళ్లు తప్పించుకుపోయారని ఒక ధృవపడని సమాచారం. తునికాకు ఏరేకాలం గనుక తునికాకు కార్మికులతో తునికాకు రేట్లు పెంచే పోరాటం గురించి మాట్లాడి సేదదీరుతున్న వారిపై గ్రేహౌండ్స్ చేసిన దాడి అని చంద్రన్న పేరుతో ఒక పత్రికలో వచ్చిన ప్రకటన నమ్మడా నికి అనుకూలంగా ఉన్నది. మళ్ల రాజిరెడ్డి, కం కణాల రాజిరెడ్డిల గురించి ఎన్‌కౌంటర్ మొదలు గాయపడి పామేడు పోలీసు స్షేన్‌లో ఉన్నారన్నంత వరకు 18వ తేదీ సాయంత్రం వరకు వార్తలు వస్తూనే ఉన్నాయి. పామేడ్ పోలీసుస్టేషన్‌లో మరో ఇద్దరు ఉత్తర తెలంగాణ నాయకులు హరిభూషన్, కిరణ్‌లు కూడా ఉన్నారని మాకు భద్రాచలంలో కూడా మీడియా వాళ్లు చెప్పడంతో వాళ్లుగానీ, ఇంకెవరైనాగానీ పోలీసుల అక్రమ నిర్బంధంలో ఉంటే వదలాలని మేం 18వ తేదీదాకా డిమాండ్ చేస్తూనే ఉన్నాం. కంకణాల రాజిరెడ్డి బంధువులే అందరికన్న ముందు కరీంనగర్ జిల్లా నుంచి భద్రాచలం చేరుకున్నారు. మృతదేహాలు చూసి అతడు లేడని నిర్ధారణతో వెనుతిరిగి పోయినా 18వ తేదీ సాయంత్రం కుటుంబ నుంచి తిరుగు ప్రయాణంలో ఉన్న మాకు ఫోన్ చేసి మా రాజిరెడ్డి మృతదేహం అడవిలో ఎక్కడో ఉందట కదా? అని ఆందోళన వ్యక్తం చేశారు.
ఏప్రిల్ 26, 27న బంద్ పిలుపు ఇస్తూ ఉత్తర తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి చెప్పి విషయాలు మాత్రమే మృతుల పేర్లు సంఖ్య విషయంలోనూ, ఊళ్లు, పేర్ల విషయంలోనూ ఇప్పటికి స్పష్టతనిచ్చిన ఆంశాలు. అట్లే ఆర్‌ఎస్ ఎట్లా చనిపోయాడనే విషయంలో అది 16వ తేదీ, 17వ తేదీన ప్రజల, ప్రజాగెరిల్లాల చేతుల్లో జరిగిందని జగన్ చెప్పాడు. ఆరోజు అంటే 16న ఎన్‌కౌంటర్‌లోనే ఐదుగురు గ్రేహౌండ్స్ గాయపడి నలుగురు తప్పించుకోగలిగారని ఒక్క ఆర్‌ఎస్‌ఐ గాయపడి మావోయిస్టుల చేతికి చ్కితే వాళ్లు చంపేశారని ఒక ప్రచారం. 18వ తేదీన మృతదేహాలు కుటుంబాలకు ఇప్పించడానికి ములుగు ఎంఎల్‌ఎ సీతక్క, ఆమె అనుయా యులు, అమరుల బంధుమిత్రుల సంఘం, మేం అక్కడ ఉండగా సాయంత్రం 4గంటలకు కుంటా ఆకాశంపై ఒక హెలికాప్టర్ ఎగిరింది. అది చాల కింద నుంచి ఆకాశంలోకి దూసుకపోవడం చూశాం. కాసేపట్లో హెలికాప్టర్‌పై మావోయి స్టులు కాల్పులు జరిపారని, చాలా మంది పోలీసులు మావోయిస్టుల బందీలిగా ఉన్నారని ఒక టీవీ ఛానెల్ హెలికాప్టర్ కాల్పులు వంటి దృశ్యాలను ప్రసారం చేయడం ప్రారంభించింది.
బీడీశర్మ గారు 19న నాకు ఫోన్‌చేసి ఒక పోలీసు డీ హైడ్రేట్ అయి చనిపోయాడని, ఆయన శవం అప్పగించడానికి విజ్ఞప్తి చేయాలని తనకు ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఫోన్ చేసాడని, తాను విజ్ఞప్తి చేయదలచు కున్నానని చెప్పాక నాకు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫోన్ చేసింది. 16న ఎన్‌కౌంటర్‌లో ఒక పోలీసు ఆర్‌ఎస్‌ఐ కూడా చనిపోయాడు. ఆయన మృత దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించమని విజ్ఞప్తి చేయండి అని ఆ ప్రయత్నాల్లో బీడీ శర్మ గారు ఉన్నారని చెప్పారు. 18వ తేదీ ఉదయ మంతా భద్రాచలంలో మృతదేహాలను గుర్తుపట్టిన రక్తబంధువులకు భద్రాచలంలోనే మృతదేహాలను అప్పగించే ఏర్పాటు చేయవలసిందిగా నేను హోంమంత్రిని కోరుతూనే ఉన్నాను. ఆమె అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్‌కు చెప్తానని, ఆ తర్వాత ఆయన సీఎంతో పాటు ఢిల్లీలో ఉన్నాడు గనుక డీజీపీకి చెప్తానని అంటూనే ఉన్నది. బీడీ శర్మగారికి చతీస్‌గడ్ ఛీఫ్ సెక్రెటరీ అమేరకు హామీ ఇచ్చాడని, భద్రాచలం లోనే మృతదేహాలు అప్పగించడానికి చతీస్‌గడ్ ప్రభుత్వానికి ఏ అభ్యంతరం లేదని నేనామెకు గుర్తు చేస్తూనే ఉన్నారు. ఇటువంటి ప్రయత్నాలు ఢిల్లీలో ఉన్న హరగోపాల్‌గారు కూడా చేస్తునే ఉన్నారు. తీరా మేం భద్రాచలం చేరుకొని అక్కడి అమానవీయ బీభత్స దృశ్యాన్ని చూఇసి మృతదేహాలను మూటలుగా చతీస్‌గడ్‌కు తరలిస్తున్నారు.
బంధు వులకు అప్పగించమని మీరు చెప్పండి అంటే ఆమె చల్లగా బంధుమిత్రులు మృతదేహాలను చూసారటకదా, ట్రాన్సిట్‌లో బంధువులకు చూపిం చి మృతదేహాలను చూసారటకదా, ట్రాన్సిట్‌లో బంధువులకు చూపించి చతీస్‌గడ్ ప్రభుత్వానికి అప్పగించమన్నది కోర్టు ఆర్డర్ అని చెప్పింది. ఉదయానికే అక్కడికి చేరుకున్న రక్తబంధువులు ,ఎపీసీఎల్‌సీ అమరుల బంధుమిత్రుల సంఘం నాయకులు కొందరు, ఎంఎల్‌ఎ సీతక్క, న్యావాదు లు, మీడియా, వందలాది మంది ప్రజలు చేసిన ఆందోళన, గుర్తింపు కొరకు మృతదేహాలను బం ధువులకు తొమ్మిదిగంటలలోపుగా చూపాలన్న కోర్టు ఉత్తర్వులు మాత్రమే ఈ మాత్రమైన కింద అడ్డదిడ్డంగా అర్థనగ్నంగా పడవేసిన మృత దేహాలను అట్లా మండుటెండలో గంటలకు గంటలు చూడగలిగినపుడు మాత్రమే బంధువులు సరిగా పోల్చుకోగలిగారనేది మాత్రం చేదునిజం.