అమరుల కుటుంబాలను ఆదుకుంటాం
ఇంటికో ఉద్యోగం శ్రీజూన్ -2న నియామక పత్రం శ్రీసీఎం కేసీఆర్ వెల్లడి
హైదరాబాద్,మే20(జనంసాక్షి):
రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమ రవీరుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ముఖ్యమంత్ర కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. వచ్చే నెల 2న జరిగే అవతరణ దినోత్సవం రోజున ఉద్యోగ నియా మకపత్రాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు ఆయా జిల్లాలకు చెందిన అమరవీరుల కు టుంబాలను సన్మా నించి.. ఈ నియామక పత్రాలు అందించాలని సూచిం చారు. ఈలోగా అన్ని జిల్లాల్లో నియామకపత్రాలు తయారుచేయాలని ఆదేశించారు. హైదరాబాద్ లో జరిగే ప్రధాన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ స్వయంగా కొందరికీ ప్రభుత్వ ఉద్యోగ నియా మక పత్రాలు అందచేస్తారు. ప్రాణత్యాగం చేసిన వారి కుటుంబసభ్యులు సూచించిన వ్యక్తికి ఉద్యోగ అవ కాశం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. వారికి కనీస విద్యార్హతలు లేకున్నా ఉద్యోగమిచ్చి.. అర్హతలు సాధిం చటానికి ఐదేళ్ల సమయం ఇవ్వాలని సీఎం సూచిం చారు.రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహణ, ఈ సం దర్భంగా చేయాల్సిన కార్యక్రమాల గురించి సీఎం కేసీ ఆర్ సవిూక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమా వేశంలో మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీలు జితేందర్ రెడ్డి, వి నోద్ కుమార్, కవిత, సీఎస్ రాజీవ్ శర్మతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. జూన్ రెండున జరిగే అవతరణ దినోత్సవం రోజున పతాకావిష్కరణ, అవార్డుల ప్రదానం, తదితర కార్యక్రమాలు నిర్వహిం చేందుకు జిల్లాల వారీగా మంత్రులకు సీఎంకేసీఆర్ బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో జరిగే ప్రధాన కార్యక్రమంలో గవర్నర్ నర సింహన్, సీఎం కేసీఆర్ పాల్గొంటారు. వరంగల్ లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మెదక్ లో మంత్రి హరీష్‌రావు, ఆదిలాబాద్ లో జోగురామన్న, నిజా మాబాద్ లో పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మంలో తు మ్మల నాగేశ్వరరావు, రంగారెడ్డిలో మహేందర్ రెడ్డి, నల్లగొండలో జగదీష్ రెడ్డి, మహబూబ్ నగర్ లో జితేందర్ రెడ్డి, కరీంనగర్ లో ఈటెల రాజేందర్ కు బాధ్యతలు అప్పగించారు.