అయ్యా మా బాధ పట్టించుకోరా.?
-మిషన్ భగీరథ వాటర్ లీకేజీని పట్టించుకోని.అధికారులు. పాలకులు
-ఉన్నతాధికారులు సమస్య పరిష్కరించాలి…
-ఆవేదన వ్యక్తం చేస్తున్న తుర్కపల్లి కాలనీవాసుల…
హన్మకొండ బ్యూరో 8 అక్టోబర్ జనం సాక్షి
ఎంతో ప్రతిష్టాత్మకంగా
ఏర్పాటుచేసిన మిషన్ భగీరథ నీళ్లను కాపాడడంలో అధికారులు పూర్తిగా విఫలం అవుతున్నారని చెప్పవచ్చును. త్రాగడానికి బుక్కడి నిలు లేని కాలనీలకు అదేవిధంగా ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తున్న విషయం విధితమే. కానీ హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామంలో మిషన్ భగీరథ నీరు నిర్వీర్యంగా గత 15 రోజుల నుండి పోతున్న గ్రామ పాలకులు. అధికారులు పట్టించుకోవడంలేదని కాలనీవాసులు తెలిపారు, దండేపల్లి గ్రామంలో తుర్కపల్లి కాలనీలో ప్రతి ఇంటికి మంచినీటి సౌకర్యం కొరకు మిషన్ భగీరథ ట్యాంక్ ఏర్పాటు చేసిన విషయం విధితమే. అయితే ట్యాంకు నుండి వచ్చే మెయిన్ పైపు పూర్తిగా లీకై 15 రోజులు గడుస్తున్నా పాలక అధికారులకు మొరపెట్టుకున్న పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న కాలనీవాసులు. వారి కాలనీలో దాదాపు 25 ఇండ్లు కలిగి ఉంటాయని. మంచినీరు తాగాలంటే ఇక్కట్లు పడాల్సి వస్తుందన్నారు. లీకేజ్ అయిన వాటర్ తో మురికి వాటర్ కలవడంతో ఆ నీరు త్రాగడం వల్ల అనారోగ్య పాలవుతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా వెంటనే ఉన్నత అధికారులు స్పందించి సమస్య పరిష్కారం చేయాలని తుర్కపల్లి కాలనీవాసులు కోరుతున్నారు.