అరుణాచలేశ్వర ట్రేడర్స్ ప్రారంభం
నిజామాబాద్,ఆగస్ట్11(జనం సాక్షి): కోటగిరి మండల కేంద్రం విూర్జాపూర్ కాలనీలోని రామాలయం ఎదురుగా, మండల ఎంపీపీ వల్లేపల్లి సునీత (శ్రీనివాస్) నూతనంగా ఏర్పాటు చేసిన అరుణాచలేశ్వర ట్రేడర్స్‌ను రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, బాన్సువాడ నియోజకవర్గ తెరాస పార్టీ ఇన్‌చార్జి పోచారం సురేందర్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కోటగిరి మండల జెడ్పీటీసీ శంకర్ పటేల్, స్ధానిక సర్పంచ్ పత్తి లక్ష్మణ్, టీఅర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎజాజ్ ఖాన్, మండల వైస్ ఎంపీపీ గంగాధర్ పటేల్, ఏఎంసీ చైర్మన్ నీరడి గంగాధర్, జిల్లా, మండల కో ఆప్షన్ సభ్యులు సిరాజ్, ఇస్మాయిల్, స్థానిక సింగిల్ విండో చైర్మన్ కూచి సిద్దయ్య, కోటగిరి గ్రామ శాఖ అధ్యక్షుడు కులకర్ణి అనిల్, మండల పరిధిలోని అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు, డైరెక్టర్లు, వార్డ్ మెంబర్లు, నియోజకర్గస్థాయి ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.