అర్చక ఉధ్యోగుల సమస్యలను తెలుసుకునేందుకే ఆత్మీయ యాత్ర రాష్ట్ర అర్చక జేఏసీ కన్వీనర్ డి.వీ.ఆర్ శర్మ

అలంపూర్ ఆగష్టు 27 జనంసాక్షి
అర్చక సేవకులకు సకాలంలో వేతనాలు రాక కొందరు , గ్రాంట్ ఇన్ ఏయిడ్ వేతనాలు అందుకొలేక మరికొంత మంది,అనేక సమస్యలతో సతమతమవుతున్న మరికొందరు పడుతున్న ఇబ్బందులను క్షేత్ర స్థాయిలో తెలుసుకునేందుకు ఆత్మీయ యాత్ర చేపట్టినట్టు తెలంగాణా రాష్ట్ర దేవదాయశాఖ అర్చక & ఉధ్యోగ జేఏసి రాష్ట్ర కన్వీనర్ డీ వీ ఆర్ శర్మ అన్నారు. అర్చక ఉధ్యోగులతో ఆత్మీయ పలకరింపు యాత్రను తెలంగాణా రాష్ట్ర సరిహద్దు జోగుళాంబ దేవి ఆశీస్సులు తీసుకొని ఉమ్మడి మాహబూబ్ నగర్ జిల్లాలోని అలంపూర్ పుణ్యక్షేత్రం నుండి శనివారం యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన అలంపూర్ పుణ్యక్షేత్ర దేవస్థానం సిబ్బంది వారికి స్వాగతం పలికారు, దైవ దర్శనం అనంతరం ఆయన ఆలయ సిబ్బంది తో మాట్లాడి వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. సాంకేతిక పరిజ్ణానం కొత్త పుంతలు తొక్కుతున్న నేపత్యంలో సామాజిక మధ్యమాలలో పలకరింపులు మనసుల మాధ్య దూరాన్ని పెంచుతున్నాయని, అందుకే తాను సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటూ తానే స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందరిని కలుస్తూ ఆత్మీయ పలకరింపు కోసం ఈ యాత్రను ప్రారంభించినట్టు చెప్పారు.
సకాలంలో వేతనాలు అందక అర్చక ఉధ్యోగులు పడుతున్న ఇబ్బందుల గురించి తెలుసుకున్నారు. సంఘ పటిష్ఠత . ఐఖ్యత కోసం పలు సూచనలు చేశారు. అదే విధంగా 2016 నుండి పని చేసే వారందరికి గ్రాంట్ ఇన్ ఏయిడ్ వేతనాలు ఇవ్వాలని అన్నారు. ప్రస్తుతం జి.ఐ,ఏ వేతనాలు పొఁదుతున్న వారికి జి.పి,ఎఫ్ ఇవ్వాలన్నారు. అన్నీ జిల్లాల వారిగా అర్చక ఉధ్యోగులకు దేవదాయ శాఖ 200 గజాల నివాస స్థలాలను కేటాయించాలన్నారు. ఆరోగ్యం సమస్య ల కోసం ప్రత్యేక కార్పస్ ఫండ్ . అలాగే అందరికి పదవీ విరమణ అనంతరం ఫెన్షన్ విధానం వర్తింపజేయాలన్నారు. నెల నెల వేతనాలు సకాలంలో అందజేయాలన్నారు. ఈ కార్యక్రమం లో జేఏసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనంద్ శర్మ. జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర ఆలయ ఉధ్యోగుల సంఘం అధ్యక్షా కార్యదర్శులు రంగనాథ్. ప్రదీప్. శ్రీను. బ్రహ్మయ్య శేఖర్ తదితరులు ఉన్నారు