కడవెండిలో విషాదఛాయలు.. బరువెక్కిన హృదయాలు

వరంగల్‌ (జనంసాక్షి) : జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండిలో విషాదఛాయలు అలుముకున్నాయి. చత్తీస్‌గడ్‌లో ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టు నాయకురాలు రేణుక అలియాస్‌ భాను అలియాస్‌ సరస్వత్రి అలియాస్‌ మిడ్కో మరణించిన విషయం తెలిసి అందరి హృదయాలు బరువెక్కాయి. సోమవారం రోజున ఉదయం జరిగిన పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో రేణుక మరణించారు. దీంతో ఆమె మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు హుటాహుటిన చత్తీస్‌గఢ్‌కు వెళ్లారు. బుధవారం (ఏప్రిల్‌ 2) రోజున కడవెండి గ్రామంలో ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు జరుగుతాయని వారి కుటుంబ సభ్యులు గుమ్మడవెల్లి సోమయ్య సార్‌, గుమ్మడవెల్లి లక్ష్మీ నరసయ్య తెలిపారు. రేణుక మరణవార్త విన్న కడవెండి గ్రామస్తులు కంటతడి పెట్టుకుంటున్నారు. ఆమెతో ఉన్న అనుబంధాలను గుర్తుచేసుకుంటున్నారు. ఉన్నత చదువులు చదివి విప్లవ బాటపట్టిన ఆమెలో ప్రశ్నించేతత్వం ఎక్కువని స్థానికులు చెబుతున్నారు.