అర్హత లేని,రిజిస్ట్రార్ లేని నకిలీ వైద్యల వల్ల. ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు
-IMA జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎమ్.చెన్నయ్య…
-ట్రేసరర్ డాక్టర్ అఖిలేష్ డిమాండ్ చేశారు…
నాగర్ కర్నూల్ రూరల్:జులై 12(జనంసాక్షి)
అర్హత లేని ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరుకు,జిల్లా పోలీస్ ఎస్పీకి వ్రాత పూర్వకంగా పిర్యాదు చేశాము.ఇప్పటికి చర్యలు తీసుకొని కారణంతో నిన్న మరో ప్రానాన్ని బలికొన్నారు.నరంకు ఇంజెక్షన్ చేయడానికి ఆనకిలి ఆసుపత్రి డాక్టర్ సాబ్ కు ఏమి అర్హత ఉంది.అనుభవం లేని వాళ్లు ఇస్తే హార్ట్ స్ట్రోక్ వస్తుంది.అదే నిన్న జరిగినది.జిల్లా కేంద్రంలో నేడు మెడికల్ కాలేజ్ వచ్చి ఎంతో అనుభవం కలిగిన డాక్టర్లు,ప్రొఫెసర్లు వచ్చారు.వాళ్ళను వినియోగించుకోవాలి దానితో పాటు.ఈ డుప్లికెట్ డాక్టర్ల ఆగడాలను అడ్డుకోవాలి.మరో సారి జిల్లా కలెక్టరుకు,జిల్లా ఎస్పీకి పిర్యాదు చేస్తాము.ఇంత జరుగుతున్నా ఈ డాక్టర్ మున్నాభాయ్ పై జిల్లా వైద్య అధికారి కన్నెత్తి అటువైపు చూడటంలేదు అని అన్నారు.