అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి

నవంబర్ 1 నుండి 5వ తేదీ వరకు సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల అధ్యయన యాత్ర శని వారం తో ముగిసింది. ప్రజా సమస్యలు పరిష్కరించాలని,అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు,పెన్షన్,నూతన రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కురి వాసుదేవరెడ్డి,నగర కార్యదర్శి గుడికందుల సత్యం లు మాట్లాడుతూ కరీంనగర్ పట్టణం పేరుకే స్మార్ట్ సిటీ గా ఉందని, నగరం నిండా అన్ని సమస్యలే ఉన్నాయని అన్నారు.
రెక్కాడితేనే డొక్కనిండని అనేక మంది పేదలకు ఇండ్లు,ఇండ్ల స్థలాలు లేవని, సంపాదించిన డబ్బులలో సగం ఇంటి కిరాయి లకే సరిపోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు
8 సంవత్సరాలుగా డబుల్ బెడ్ రూమ్ ల కోసం పేదలు ఎదిరు చూస్తున్నారని,రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వకుంటే సిపిఎం ఆధ్వర్యంలో ఆక్రమిస్తామని హెచ్చరించారు.
నగరంలో అనేక మంది పేదలకు రేషన్ కార్డులు లేవని,అర్హులైనవారికి పెన్షన్ సౌకర్యం కల్పించాలని అన్నారు.
నగరంలో12 సంవత్సరాలుగా అంతర్గత మురికి కాలువల నిర్మాణం కోసం రోడ్లను తవ్వి వదిలి వేయడం మూలంగా పట్టణంలో రోడ్లన్నీ అధ్వానంగా మారాయని అన్నారు
.రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం 100 కోట్లు తెచ్చానని గొప్పలుచెప్పుకొని,పాలాభిషేకాలు చేసుకొన్న ఎంపీ బండి సంజయ్ రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి ఎందుకు నిర్మించడం లేదని ప్రశ్నించారు.నగరంలో వీధి కుక్కలు,కోతుల బెడద అధికంగా ఉందని మున్సిపల్ అధికారులు వెంటనే యుద్ధ ప్రాతిపదికన తగు చర్యలు తీసుకోవాలన్నారు.
అనేక సంవత్సరాల నుండి కరీంనగర్ ప్రజలు డంపింగ్ యార్డ్ దుర్వాసనతో ఊపిరాడక ఇబ్బందులు పడుతున్నారని,డంపింగ్ యార్డ్ ను తరలించాలని డిమాండ్ చేశారు.
నగరంలో అధికార పార్టీ కార్పొరేటర్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయని ప్రజలను కాపాడవలసిన వారే భూ మాఫియాగా మారి,అక్రమ రియల్ ఎస్టేట్ దందకొనసాగిస్తున్నారని, అడ్డొచ్చిన వారిపై దాడులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమాఫియాకు పాల్పడుతున్న కార్పొరేటర్ల పై రౌడీ షీట్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు.లేదంటే సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.అనంతరం అడిషనల్ కమిషనర్ వినతిపత్రం అందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు ఎస్.రజనీకాంత్, నరేష్ పటేల్,నగరకమిటీ సభ్యులుజి.పి.మురళి,కొంపల్లిసాగర్,పున్నం రవి,పుల్లెల మల్లయ్య,గజ్జల శ్రీకాంత్,ద్యావ అన్నపూర్ణ,యమునా, N.లావణ్య,తదితరులు పాల్గొన్నారు.