అర్హులైన వారందరిని ఓటరుగా నమోదు చేయాలి

జిల్లా పాలనాధికారి  ముష ర్రఫ్ ఫారుఖీ
   ఖానాపూర్ రూరల్ 26 నవంబర్ (జనం సాక్షి): 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ   ఓటర్లుగా తమ  పేర్లను నమోదు చేసుకోవాలని , అందుకు బూత్ లెవెల్ అధికారులు గ్రామాల్లో  అవగాహన కల్పించాలని నిర్మల్ జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ అన్నారు.
  ప్రత్యేక ఓటర్ నమోదు ప్రక్రియ ను నిర్వహిస్తున్న పోలింగ్ బూత్ కేంద్రము ను శనివారం  ఖానాపూర్ మండలం లోని పాత తర్లపాడు,   తర్లపాడు    ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలలో  రిజిస్టర్ లలో నమోదు చేసిన పేర్లను పరిశీలించి, తగు సూచనలు చేశారు.ఈ సందర్భంగా  జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ 18 సంవత్సలు నిండిన ప్రతీ ఒక్కరిని ఓటరు గా నమోదు చేయాలని,  యువతి, యువకులతో పాటు దివ్యాంగులు మరియు ట్రాన్స్జెండర్ లను ఓటర్లుగా  నమోదుచేయాలని,  మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించడం జరుగుతుందని, బిఎల్ఓ లు ఇంటింటి సర్వే ద్వారా ఓటర్లను చైతన్యవంతులను చేయాలని, చనిపోయిన వారి వివరాలను జాబితా నుండి తొలంగించాలని తెలిపారు, పోలింగ్ కేంద్రంలో బూత్ లెవెల్ అధికారులు,  ఎలక్షన్ సిబ్బంది అందరు అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించారు.

తాజావార్తలు