-అర్హులైన వారికి పెన్షన్లు ఇవ్వాలి.

-గ్రామస్థాయిలో యూత్ కాంగ్రెస్ శ్రేణులు పటిష్టం కావాలి.
-రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగిరేలా యూత్ -కాంగ్రెస్ శ్రేణులు ముందుండాలి.
-యూత్ కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్, అచ్చంపేట ఇంచార్జీ కొడిదేల రాము.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, జులై 24 (జనంసాక్షి):

తెలంగాణ రాష్ట్రంలో రజాకారులను తలదన్నేలా పాలిస్తున్న కెసిఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు యూత్ కాంగ్రెస్ శ్రేణులంతా సమయత్తం కావాలని నాగర్ కర్నూల్ యూత్ కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్, అచ్చంపేట ఇంచార్జ్ కొడిదెల రాము పిలుపునిచ్చారు. ఆదివారం అచ్చంపేట నియోజకవర్గం చారగొండ మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గణేష్ గౌడ్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి యూత్ కాంగ్రెస్ నేతల రివ్యూ మీటింగ్ లో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం అత్యంత పేదరికంలో మగ్గుతున్న వికలాంగులు వయోవృద్ధులు వితంతువులకు పెన్షన్లు కూడా మంజూరు చేయలేని దరిద్రపు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన ఆవశ్యకత యూత్ కాంగ్రెస్ నేతలపై ఉందన్నారు.కనీసం నూతన రేషన్ కార్డులను కూడా మంజూరు చేయకుండా పేదల ప్రాణాలతో చెలగాటమాడుతోందని ధ్వజమెత్తారు.గ్రామ గ్రామాన యూత్ కాంగ్రెస్ నేతలు బూత్ కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రతి ఒక్కరిని చైతన్య పరచాల్సిన బాధ్యత ఉందన్నారు.వచ్చే ఎన్నికల్లో అచ్చంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ వెంకట్ గౌడ్, పానుగంటి అంజయ్య, తిరుమలేశ్, నాగేంద్ర నాయుడు, మహేందర్, శంకర్, వెంకట్ రెడ్డి, సాయి ప్రకాష్, సహదేవ్, శివ, సిద్ధార్థ రెడ్డి తదతరులు పాల్గొన్నారు.