అలంపూర్ జోగులాంబ ఆలయాలను దర్శించుకున్న సీపీయస్ రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం స్థితప్రజ్ఞ
అలంపూర్ ఆగష్టు 18((జనంసాక్షి )
తెలంగాణ రాష్ట్రంలోని ఏకైక శక్తిపీఠం అలంపూర్ జోగులాంబ దేవాలయాలను శుక్రవారం తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం స్థిత ప్రజ్ఞ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల శ్రీకాంత్, రాష్ట్ర కోశాధికారి నరేష్ గౌడ్ మరియు రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు దర్శించుకున్నారు .ఈసందర్బంగా
రాష్ట్ర అధ్యక్షులు స్థిత ప్రజ్ఞ మాట్లాడుతూ,రాష్ట్ర శాఖ పిలుపుమేరకు జూలై 16న అలంపూర్ జోగులాంబ అమ్మవారి దేవాలయం నుండి పాత పెన్షన్ సాధన సంకల్ప రథయాత్ర దిగ్విజయంగా ప్రారంభమై జూలై 31న యాదాద్రి నరసింహ స్వామి దేవాలయం వద్ద ముగిసింది అన్నారు.ఈ పాత పెన్షన్ సాధన సంకల్ప రథయాత్ర భారీ స్థాయిలో 3లక్షల సీపీయస్ మరియు ఒపియస్ ఉద్యోగ ఉపాధ్యాయులను ఐక్యము చేసిందిఅని,సీపీయస్ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి పాత పెన్షన్ సాధన సాకార సభను ఆగస్టు 12న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో దాదాపు రెండు లక్షల ఉద్యోగ ఉపాధ్యాయులచే విజయవంతం చేయడం జరిగింది అన్నారు . మా సీపీస్ ఉద్యోగ ఉపాధ్యాయుల ప్రధాన ఆకాంక్ష సీపీస్ రద్దును ముఖ్యమంత్రి మా యొక్క సమస్యను తీర్చగలరని ఆశాభావంతో మూడు లక్షల 30 వేల ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి అన్నారు . సిపిఎస్ ను రద్దు చేయడం వల్ల ఇప్పటికిప్పుడు నయా పైసా భారమనేది ప్రభుత్వంపై ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లను భరించేది 15 సంవత్సరాల తరువాతనే అని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు నాగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి , జిల్లా కోశాధికారి వన్నవాడ రమేష్ కుమార్, జిల్లా సహ అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి , జిల్లా కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి , పరుష రాముడు, రజినీ , అలంపూర్ మండల అధ్యక్షులు కృష్ణ , ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి , అయిజ మండల అధ్యక్షులు వీరేష్, మానపాడు మండల అధ్యక్షులు రామకృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి వెంకట కృష్ణ , అయిజ మండల ఉపాధ్యక్షులు గోవింద్,మండల బాధ్యులు జైల్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.