అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
వరంగల్, నవంబర్ 1: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు బృంద నృత్యాలను చాలా బాగా ప్రదర్శించారు. సెంట్‌గాబ్రియల్ పాఠశాల విద్యార్థుల నృత్యం, చక్కెర కలిపిన తియ్యని పాటను ఆలపించారు. జెఎస్‌ఎం హైస్కూల్ విద్యార్థుల సిరులు పొందిన భారతదేశం నృత్యాన్ని, సెంట్‌పీటర్సు విద్యార్థులు తేనేల తీయటి మాటలతో, నృత్యాన్ని చివరిగా ప్రభుత్వ పాఠశాల లష్కరు బజారు విద్యార్థులు ప్రదర్శించారు. ఏ దేశ మేగిన ఎందుకాలిడిన అనే బృంద నృత్యం అలరించింది.