అవమానాలు భరించలేక పార్టీ మారాను – పాత్రికేయ సోదరులతో ఆత్మీయ సమావేశంలో. -జెడ్పి చైర్ పర్సన్ సరిత.
గద్వాల నడిగడ్డ, ఆగస్టు 1 (జనం సాక్షి);
అధికార బీఆర్ఎస్ పార్టీలో గత నాలుగేళ్లలో తాను అనేక అవమానాలు ఎదుర్కొనీ తీవ్ర మనస్థాపాన్ని గురై కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు జెడ్పి చైర్ పర్సన్ సరిత అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని హిమాలయ ఫంక్షన్ హాల్ లో జెడ్పి చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య అధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ తాను బిఆర్ఎస్ పార్టీ స్థానికత నాయకులతో అనేక అవమానాలు గురైనట్లు దీంతో తాను మనస్థాపానికి గురై టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరానని ఆమె తెలిపారు. అనేక సమావేశాలలో స్థానిక నాయకులు తనను దూరంగా ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను స్థానికురాలని కాననే అపోహాలు కొంతమందిలో ఉన్నాయని గతంలో ఇక్కడ పాలించిన నాయకులు స్థానికేతరులే కదా అని ప్రశ్నించారు. పేద బడుగు బలహీన వర్గాల నుండి తాను ప్రశ్నిస్తున్నానని బలహీనవర్గాలకు రాజ్యాధికారం రావాలని తపనతో తాను రాజకీయాలలోకి వచ్చినట్లు ఆమె తెలిపారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే బడుగు బలహీనవర్గాల అభివృద్ధి కొరకు కృషి చేస్తానని ఆమె అన్నారు. ఇంతేగాక జర్నలిస్టుల ఇళ్లస్థలాల కొరకు అహర్నిశలు కృషి చేస్తానని తాను ఎమ్మెల్యేగా ఎంపికైన మరుక్షణం జర్నలిస్టులకు ఇల్లు కేటాయించేలా కృషి చేస్తానని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బండ్ల చంద్రశేఖర్ రెడ్డి, అమరవాయి కృష్ణారెడ్డి, గట్టు సత్య నారాయణ,కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.