అవినీతికి పాల్పడిన సీఏను సస్పెండ్ చేయాలని గ్రామస్తులు ఆందోళన

*జాతీయ రహదారిపై బైఠాయించిన గ్రామస్తులు,
ఖానాపురం అక్టోబర్21జనం సాక్షి
అవినీతికి పాల్పడిన సీఏను సస్పెండ్ చేయాలని కోరుతూ శుక్రవారం ఖానాపురం మండల కేంద్రంలో కొత్తూరు గ్రామస్తులు మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి జాతీయ రహదారి 365 పై బైఠాయించి అవినీతికి  పాల్పడిన సిఎంను సస్పెండ్ చేయాలని కోరుతూ ఆందోళన చేశారు.
 మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన మహిళా సంఘాల సీఏ విజిత గ్రామంలోని పలు మహిళా సంఘాల కు తెలియకుండా వారి పేరు మీద లోన్లు ఎత్తుకొని అవినీతికి పాల్పడింది. ఈ విషయమై గతంలో మహిళా సంఘాల వారు పై అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణకు వచ్చిన ఏపీఎం సుధాకర్ సీఏ కి అనుకూలంగా మాట్లాడుతున్నాడని అధికారులను గదిలో బంధించారు. ఇప్పటివరకు మహిళా సంఘాల సొమ్ము తిరిగి చెల్లించకపోవడంతో గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. అవినీతికి పాల్పడిన సీఏను విధుల్లోంచి తొలగించి అవినీతికి పాల్పడిన సొమ్మును  రికవరీ చేయాలని గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. పోలీసులు వచ్చినా రోడ్డుపైనే బైఠాయించారు. ఎట్టకేలకు అధికారులు నచ్చజెప్పడంతో వారు ధర్నాను విరమించారు.