అసంఘటిత రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి.

భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ జి అశోక్.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై 26(జనంసాక్షి):
అసంఘటిత రంగంలో పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికులు ఆటో అమాలి వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ జి అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం ముందు అసంఘటిత రంగ కార్మికులు ధర్నా నిర్వహించారు కనీస వేతనాల పెంపుపై ఐదు రంగాలకు ఇచ్చిన ఫైనల్ నోటిఫికేషన్ కు గెజిట్ ఇవ్వాలని 73 షెడ్యూల్డ్ పరిశ్రమల కనీస వేతనాలజీవోను సవరించాలని ట్రాన్స్పోర్ట్ అమాలి రైస్ మిల్ కార్మికులకు వెల్ఫేర్ బోర్డును అమలు చేయాలని భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు నిధులు దుర్వినియోగాన్ని అరికట్టాలని కార్మికులందరినీ బోర్డులో నమోదు చేయించాలని కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్ కోడులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఆ సంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని 50 సంవత్సరాల నిండిన అమాలి భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు రామయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ, నాగనూలు శ్రీనివాస్, కాజా, మల్లేష్, శివుడు, వెంకటయ్య, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.