అసహ్యం


(గత బుధవారం సంచిక తరువాయి)

ఆమె గురించి కొన్ని ప్రశ్నలు అడిగాను. సమాధానాలు చెప్పింది. బియ్యే చదువు మధ్యలో ఆపేసిందని, వారాసిగూడలో ఉంటున్నట్టు చెప్పింది. ఆమెతో మాట్లాడుతుంటే ఒంటరితనం పోయినట్టు అన్పించింది. ఆమె గురించి ఓ నిర్ణయానికి వచ్చాను. చొరవ తీసుకోవాలి. ఆలస్యం చెయ్యకూడదనుకొన్నాను. కాఫీ తాగి, బిల్‌ చెల్లించి బయటకు వచ్చాం. ఎనిమిది దాటింది. కాస్త చలిగా ఉంది. దగ్గర దగ్గరగా నడుస్తున్నాం. ఇంత దగ్గరగా ఆడవాసన ఎప్పుడూ రుచి చూసి ఎరగని తనకి మనస్సంతా హాయిగా, తేలిపోతున్నట్టుగా అన్పించసాగింది. ఏదో మాట్లాడుతూ నడుస్తున్నాం. కొద్దిసేపటికి `
‘యూనివర్సిటీ హాస్టల్స్‌ ఎలా ఉంటాయి. ఎప్పుడూ చూడలేదు’ అంది. ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకూడదు.
‘మా రూంకి పోదాం చుద్దురుగాని’ అన్నాను ధైర్యం చేసి.‘పదకొండు లోపు నేను ఇంటికి వెళ్లిపోవాలి మరి’ అంది.
‘ఆటోలో వెళ్దాం. త్వరగా వెళ్లవచ్చు. అక్కడి నుంచి వారాసిగూడ దగ్గరే కదా’
‘సరే’నంది ఆమె.
ఇద్దరమూ దగ్గర దగ్గరగా ఇంకా ముందుకు నడ చాిం. ఆటో దొరకలేదు. అందుకని ఇంకా కొంత దూరం నడవాల్సి వచ్చింది. ఆమె కొంగు తాకితేనే నాలో ఎంతో వేడి పొంగుతుంది. మనస్సు ఆనందం తో ఊగిపోతుంది. నా చేతివేళ్లు ఆమె చేతికి తగల గానే ఆమె అలాగే పట్టుకుంది. వెచ్చగా, హాయిగా ఆనందంగా అన్పించసాగింది. ఏదో అనుభూతి. చాలాకాలంగా నలుగుతున్న అసంపూర్తి గీతాన్ని పూర్తిచేసిన సంతృప్తి. రోడ్డు మీద అలా నడుస్తుంటే ఎవరైనా చూస్తే అని భయమేసింది. కానీ నాకు నేను ధైర్యం చెప్పుకొన్నాను.
‘చెయ్యి అలా వణుకుతుందేమిటి’ అంది.
సిగ్గేసింది.


‘చలిగా ఉంది కదా’ అన్నాను సర్దుకొంటూ.
ఇలా తిరగడం ఆమె సరదానా, లేక డబ్బులేమన్న అవసరం ఉన్నాయా, ఆలోచనలు తనలో. అయినా తను తప్పుగా ఆలోచిస్తున్నాడేమో. ఆమెకి అలాంటి ఆలోచన ఉందో లేదో.
‘ఈ చలిలో మీ చెయ్యి వెచ్చగా హాయిగా ఉంది’ అన్నాను కాస్త గొంతు సర్దుకొని.
‘మొదటిసారా?’ అంది ఆమె.
అర్థం కాలేదు నాకు.
‘మీకు’
నవ్వింది. సమాధానం చెప్పలేదు.
డబ్బుల గురించేనేమో. ఏదో తెల్సుకోవాలనుంది. ఏమైనా ఈ రాత్రికి ఆమెని వదులుకోవాలని లేదు. ‘డబ్బుల కోసమేనా’ అడి గాను.
‘అవును’
‘ఎంతకావాలి’
‘ఓ వంద రూపాయలు’
ఆగి వున్న ఆటో కన్పిస్తే ఎక్కడికి వెళ్లాలో చెప్పి కూర్చున్నాం. మనస్సంతా ఒంట రిగా ఉంది. ఆమెని వదులు కోవాలని లేదు. కోరికలు విజృంభి స్తున్నాయి. ఆటో వేగంగా యూని వర్సిటీ వైపు వెళ్తుంది. ఇద్దరమూ కబుర్లలో పడ్డాం. ఆమె చేతుల్ని నా చేతుల్తో పట్టుకొని కూర్చున్నాను. పదిహేను నిముషాల్లో ఆటో యూనివర్సిటీ ప్రెస్‌ దగ్గరకు చేరింది. ఆటోని అక్కడే ఆపి డబ్బులు ఇచ్చేసి ఇద్దరమూ ఆటో దిగాం. లైటు వెలుగులు తప్ప ఎలాంటి సందడి లేదు. రూం తాళం తీసి లోనికి నడిచాం. టేబుల్‌ ల్యాంప్‌ ఇంకా వెలుగుతూనే ఉంది. ఫ్యాన్‌ ఇంకా తిరుగుతూనే ఉంది. గదినంతా పరీక్షగా చూసి నావైపు వింతగా చూసింది.
సాహిత్యం గురించి, యూనివర్సిటీ హాస్టల్‌ గురించి చెప్పాను.ఆడవాళ్ల గురించి, కుర్రాళ్ల గురించి, సినిమాల గురించి చెప్పింది ఆమె. ఈ టైంకి మా గదివైపు ఎవరూ రారన్న ధైర్యం ఉన్నా, మనస్సులోపల ఎక్కడో భయం పీకుతూనే ఉంది.అరగంట గడిచాక ఆమె నడుము చుట్టూ చేతులేసి తలుపుపెట్టాను. నా గుండెలు కొట్టుకొంటున్న ధ్వని నాకు విన్పిస్తూనే ఉంది. ఏరో మత్తు ఆవరించినట్టుగా ఉంది.    మంచం మీద ఇద్దరమూ వచ్చి కూర్చున్నాం. టేబిల్‌ ల్యాంప్‌ ఆర్పేసింది ఆమె.రూం అంతా వేడెక్కి పోయింది. నాకు తెలియకుండానే నా చేతులు ఆమెలోని ఏవో భాగాల్ని తడుముతూనే ఉన్నాయి. పుట్టగానే పాపకి ఏడుపు ఎవరూ చెప్పకుండానే ఎలా వస్తుందో ఇది అలాగే అన్పించింది నాకు. ఆమె కౌగిలిలో చలి వేడిక్కిపోయింది. ఎన్నో యుగాల అనుభూతి, కొన్ని నిమిషాలు మెదడులో ఏమీ ఆలోచనలు లేవు. నెరుడా లేడు, శ్రీశ్రీ లేడు, ఈలియట్‌ లేడు, ఎజ్రాపౌండ్‌ లేడు, కార్ల్‌మార్క్స్‌ లేడు. ఉదయాల్లేవు, సాయంత్రాలు లేవు. అసంపూర్తి గీతం లేదు. అసంపూర్తి కథ లేదు. ఏమీ లేదు ఒక్క ఆనందం తప్ప. నరాల తీపి బాధ తప్ప. అనిర్వ చనీయమైన అనుభూతి తప్ప.కొన్ని నిమిషాల తర్వాత మామూలు పరిస్థితిలోకి వచ్చాను. మెదడు ఆలోచించడం మొదలుపెట్టింది. ఆమె డబ్బులు అడిగితే ఎలా అన్న ఆలో చన. ఏదో గిల్టీనెస్‌. ఆమె మంచంపై నుంచి లేచి బట్టలు సర్దుకొంది. నేను కూడా సర్దుకొన్నాను. కానీ డబ్బులు ఎలా ఎలా ఇదే ఆలోచన. మనస్సంతా ఒకటే బాధ, వెలితి. టేబిల్‌ ల్యాంప్‌ వెలిగించింది ఆమె. అద్దంలో మొఖం చూసుకొని వెంట్రుకలు సరి చేసుకొంది. పోవడానికి రెడీ అవుతోంది.
ఓ రెండు నిమిషాలు గడిచాక
‘డబ్బులివ్వండి నేను పోతాను’ అంది.
బుక్‌షెల్ఫ్‌ వద్దకు వెళ్లి ఈలియట్‌ కలెక్టడ్‌ వర్క్స్‌, చలం మ్యూజింగ్స్‌, శ్రీశ్రీ లండన్‌ మహాప్రస్థానం పుస్తకాలు తీసి ఆమె చేతిలో పెట్టి.    ‘నేనెంతో ప్రాణప్రదంగా చూసుకొనే ఈ పుస్తకాలు మూడు వందల రూపాయల కన్నా ఎక్కువ విలువ చేస్తాయి. ఇవు తీసుకెళ్లండి. ఇప్పుడు నా దగ్గర డబ్బులేమీ లేవు. అన్నాను.కొన్ని క్షణాలు గడిచాక, అసహ్యమైన చూపు విసిరి, ఆ పుస్తకాల్ని నా మొ ఖం మీద విసిరికొట్టి, వెనక్కి చూడకుండా, తలుపుతీసుకొని ఆమె వెళ్లిపోయింది. ఆమె విసిరిన చూపు తేజాబై నా మనస్సుని కొరికేసింది. నామీద నాకే అసహ్యం వేసింది. నా మీద నాకే కోపం వచ్చింది.