అసాంఘిక కార్యకలాపాలకు అడ్డ గా మారిన డబుల్ బెడ్ రూములు

నవంబర్ 1 నుండి 5వ తేదీ వరకు సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల అధ్యయన యాత్ర మంగళ వారం స్థానిక కిసాన్ నగర్ వద్ద ప్రారంభమై,విద్యారణ్యపురి, తీగలగుట్టపల్లి,చంద్రపురి కాలనీ,ఆర్టీసీకాలనీ మీదుగా సుభాష్ నగర్ చేరుకుంది.ఈ సందర్భంగా సిపిఎం అధ్యయన బృందానికి ప్రజలు అనేక సమస్యలను వివరించారు.
ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం మాట్లాడుతూ ఎన్నికల ముందు కరీంనగర్ ను సింగాపూర్,డల్లాస్,అద్దం తునక చేస్తా అన్న కెసిఆర్ కరీంనగర్ ను చిన్న వర్షానికే చెరువులను తలపించే విధంగా మార్చారని ఎద్దేవా చేశారు.కిసాన్ నగర్ లో 2003 సంవత్సరంలో అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ కి శంకుస్థాపన చేసి,90 శాతం పని పూర్తి చేసి వదిలేసారని,ఇప్పటికీ కమ్యూనిటీ హాల్ నిరూపయంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కమ్యూనిటీ హాల్ ను పూర్తి చేసి,అందులో గ్రంధాలయాన్ని కూడా ఏర్పాటు చేయాలని అన్నారు.పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిఅయిన చేదభావి స్థలాన్ని అంగన్వాడి సెంటర్ కి కేటాయించి,భవనాన్ని నిర్మించాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారాయని ఆర్టీసీ కాలనీ, ఆరేపల్లి లో నిర్మించిన 60 డబుల్ బెడ్ రూములు మందు బాబులకు నిలయంగా మారాయని, డబుల్ బెడ్ రూమ్ లో మినీ బార్ ను తలపించే విధంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన పేదలకు కేటాయించాలని, అసంపూర్తిగా మిగిలి ఉన్న డబల్ బెడ్ రూములను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.లేదంటే సీపీఎం ఆధ్వర్యంలోఅర్హులైన పేదలను తీసుకెళ్లి ఆక్రమిస్తామని హెచ్చరించారు.కరీంనగర్ లో గత 12 సంవత్సరాల నుండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పేరిట తవ్విన రోడ్లనే,మళ్లీ మళ్లీ తవ్వుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ కాంట్రాక్టర్ల జేబులో నింపుతున్నారని అన్నారు.
సిపిఎం ఆధ్వర్యంలో నవంబర్ 5వ తేదీ వరకు వచ్చిన ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి,పరిష్కరించే దిశగా కృషి చేస్తామని, లేదంటే ఆందోళన పోరాటాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.సిపిఎం అధ్యయనయాత్ర బృందంలో నగర కమిటీ సభ్యులు P.మురళి,కొంపల్లి సాగర్, పున్నం రవి,నాయకులు కోనేటి నాగమణి,ద్యావఅన్నపూర్ణ,N.లావణ్య,నునిగంటి రాజు, కుడుదుల నరేష్,జిల్లాల చిరంజీవి,మల్లేశం,సతీష్ ఆంజనేయులు,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.