అసెంబ్లీ ముట్టడికి తరలి వెళ్తున్న రెడ్డి నాయకులను అరెస్టు చేసిన పోలీసులు

జహీరాబాద్ సెప్టెంబర్ 13 జనం సాక్షి
రాష్ట్ర రెడ్డి ఐక్యవేదిక పిలుపు మేరకు చలో అసెంబ్లీ ముట్టడికి తరలి వేళ్లుతున్న రెడ్డి నాయకులను మంగళవారం జహీరాబాద్ పట్టణ, ఝరసంగం,న్యాల్కల్, కోహీర్ మండలాలో పోలీసులు ఎక్కడి కక్కడే అరెస్టులు చేసి అయా పోలీస్ స్టేషన్లకు తరలించారు.రెడ్డి ఐక్యవేదిక ఆద్వర్యంలో జరుగుతున్న ఉద్యమాలకు స్పందించి 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాక్షిక మేనిఫెస్టోలో రెడ్డి కార్పోరేషన్ ఏర్పటు చేస్తామని హమీ ఇచ్చినట్లు తెలిపారు. రెడ్డి కార్పోరేషన్ ఎర్పటు చేస్తామని హమీ ఇచ్చి మర్చిపోయిన ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తు చేయాలని చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్ర కమిటి పిలుపు మేరకు అసెంబ్లీకి తరలి వేళ్లుతున్న రెడ్డి నాయకులను ఎక్కడి కక్కడే అరెస్టులు చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు కే.నారాయణ రెడ్డి, జహీరాబాద్ అసెంబ్లీ అధ్యక్షులు జి .విరారెడ్డి, ప్రదాన కార్యదర్శి క్రిష్ణరెడ్డి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్ .సత్యనారాయణ రెడ్డి, నాయకులు జె .శ్రీనివాస్ రెడ్డి, క్రిష్టరెడ్డి, మాదవరెడ్డి, .నర్సింహరెడ్డి, మాహీపాల్ రెడ్డి, కుసురెడ్డి, .జనర్ధన్ రెడ్డి, .జనర్ధన్ రెడ్డి, ఝరసంగం మండలంలో పిఏసీఎస్ మాజీ చైర్మన్ సంగారెడ్డి, నాయకులు సుధాకార్ రెడ్డి, మాజీ ఎంపిటిసి సభ్యులు నవాజ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి, సుబాష్ రెడ్డి, మాణిక్ రెడ్డి,రవీందర్ రెడ్డి,జీర్లపల్లి నవాజ్ రెడ్డి, జైపాల్ రెడ్డి, ధర్మారెడ్డి, రామిరెడ్డి, తదితరులు పాల్గోన్నారు.