ఆందోళన చెందొద్దు ఆత్మహత్యలొద్దు
– అన్నదాతలకు అభయ హస్తం
– ప్రత్యేక హోదా సాధించడంలో టీడీపీ, వెఎస్సార్‌సీపీ విఫలం
– భూసేకరణ బిల్లు అడ్డుకుంటాం
– ‘అనంత’లో ఏఊసీసీ రాహుల్ భరోసా యాత్ర
అనంతపురం,జులై 24(జనంసాక్షి): రైతులు ఆందోళన చెందొద్దని ఏఐసీసీ ఉపాధ్యాక్షుడు రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారు. తనయాత్రలో పలువురు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామనర్శించి వారికి చెక్కులను అందచేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రైతులు, చేనేత కార్మికులు ఆందోళన చెందవద్దన్నారు. కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుందని రాహుల్‌గాంధీ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా విషయంలో టిడిపి, బిజెపి దోబూచులాడుతున్నాయని అనంత పర్యటనకు వచ్చిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. పోలవరంపైనా స్పష్టత లేదన్నారు. ఈ విషయంలో టిడిపి ఎందుకు పోరాడడం లేదన్నారు. ఏపీ అగ్రగామిగా ఉండాలంటే ప్రత్యేక ¬దా, పోలవరం అవసరమన్నారు. విూ భవిష్యత్ కోసం టీడీపీ, వైసీపీలా రాజీపడబోమని రాహుల్ గాంధీ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా కోసం కేంద్ర ప్రభుత్వాన్ని తెలుగుదేశం, వైకాపా ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. అనంతలో ఒకరోజు రైతు భరోసా యాత్రకు వచ్చిన రాహుల్‌కు కాంగ్రెస్ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. శుక్రవారం అనంతపురం జిల్లా ఓబుళదేవరచెరువు గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో రాహుల్ పాల్గొన్నారు. విూరు ప్రేమతో ఇందిరమ్మ అని పిలుచుకుంటారని, ఆమె ప్రసంగించిన వేదికపై నుంచి ప్రసంగిస్తున్నానని ఆయన అన్నారు ఇందిరమ్మ ఇక్కడ వదలిపెట్టిన సంస్కతిని తాను రక్షిస్తానని అన్నారు. పేదలు,రైతులకు భరోసా లేనప్పుడు ఎందుకు ఈ దేశం అనే పరిస్థితి ఉండరాదని అన్నారు. రైతులు, చేనేత కార్మికులు, పేదల సమస్యలపై కాంగ్రెస్ పోరాడుతుందన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటించారు. రైతులు, చేనేత కార్మికుల కుటుంబాలకు భరోసా ఇచ్చేందుకు పాదయాత్ర చేస్తున్నట్లు చెప్పారు. టిడిపి,వై.కాంగ్రెస్ లు ఎందుకు ప్రత్యేక ¬దా, పోలవరంలపై మాట్లాడడం లేదని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఎపికి రావాల్సిన వాటిని అడగడానికి ఈ రెండు పార్టీలు ఎందుకు భయపడుతున్నాయని ఆయన అన్నారు. ఎందుకు వారు రోడ్లపైకి రావడం లేదని ఆయన అన్నారు. ఎపి భవిష్యత్తును మోడీ కాళ్లదగ్గర పెట్టడానికి వాళ్లెవరు అని ఆయన అన్నారు. తాము ఎవరికి భయపడబోమని ఆయన అన్నారు. రైతుల కష్టాలలో పాలుపంచుకోవడానికే తాను అనంతపురం జిల్లాకు వచ్చానని అన్నారు. రైతులు,పేదలు ఎంతో శ్రమపెడతారని ,కాని వారికి రావల్సిన ఫలితం రావడం లేదని రాహుల్ గాంధీ అన్నారు. ఈ సందర్భంగా రైతులు, చేనేత కార్మికులతో రాహుల్‌గాంధీ ముఖాముఖి నిర్వహించారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా, పోలవరం సాధనకోసం ఎక్కడైనా పోరాటానికి సిద్ధమని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రకటించారు.
భూసేకరణ బిల్లును అడ్డుకుంటాం
రైతు అనుమతి లేకుండా భూములు సేకరించకూడదని, రైతుతో పాటు రైతు కూలీలు లబ్దిపొందేలా మేం చట్టం తీసుకొచ్చాం. రహస్య అజెండాతో భూసేకరణ చట్టం మార్చాలని మోదీ చూస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పోరటం వల్లే భూసేకరణ బిల్లుపై కేంద్ర పునరాలోచన చేస్తోందన్నారు. కేంద్రం భూ సేకరణ బిల్లును మార్పు చేయడానికి ప్రయత్నిస్తోందని రాహుల్ అన్నారు. కాంగ్రెస్ టైమ్ లో రైతుల అనుమతితో భూమి తీసుకోవాలని చట్టం తెస్తే ,కాని ఇప్పుడు బిజెపి నేతలు తమ వ్యాపార స్నహితుల కోసం ఆ క్లాజ్ తొలగించాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. పరిశ్రమలు ఐదేళ్లలో పెట్టకపోతే ఆ భూమి వెనక్కి తీసుకోవాలని తాము బిల్లు లో పెట్టామని ఆయన అన్నారు. కాని మోడీ ప్రభుత్వం మొదట తీసుకు వస్తున్నది బూమి బిల్లులో మార్పులు అని అన్నారు. మోడీ రహస్య ఎజెండాతో భూమలు లాక్కోవాలని చూస్తున్నారని అన్నారు. రైతుల భూములను తేలికగా లాక్కోవచ్చని మోడీ అనుకుంటున్నారని ఆయన విమర్శించారు. మోడీ అంత తేలికగా భారత రైతుల భూములను లాక్కోలేరని
రాహుల్ అన్నారు. రైతులకు ఉన్న శక్తి ఏమిటో మోడీకి తెలియచేస్తామని అన్నారు. దేశానికే అండగా ఉన్న రైతులకు, ప్రభుత్వాలు అండగా ఉండటం లేదని మండిపడ్డారు. భూసేకరణ బిల్లు ద్వారా రైతుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోందని ధ్వజమెత్తారు. రైతు అనుమతి లేకుండా భూసేకరణ చేయొద్దని తాము చట్టం తీసుకొచ్చామని గుర్తు చేశారు. మోడీ అధికారంలోకి వచ్చిన వెంటనే భూసేకరణ బిల్లులో నిబంధనలు మార్చేశారని తెలిపారు.
ఎన్డీఎ విధానాలతో రైతుల ఆత్మహత్యలు
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతులకు భరోసా ఇవ్వడంలో విఫలం అయిందని మెగాస్టార్,కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి అన్నారు. రాహుల్ గాంధీ బరోసా యాత్ర సందర్భంగా ఓబులదేవుల చెరువు వద్ద జరిగిన సభలో ప్రసంగించారు. ఎన్.డి.ఎ. విధానాల వల్ల రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. గతంలో తొమ్మిదేళ్ల పాటు టిడిపి పాలనలో జరిగిన రైతుల ఆత్మహత్యలు జరిగితే , సోనియాగాందీ స్వయంగా వచ్చి రైతులకు పరిహారం ఇచ్చారని అన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ హయాంలో రైతులు సంతోషంగా ఉన్నారని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేస్తూ రుణమాఫీ చేశానని చెప్పుకోవడం సిగ్గు చేటని అన్నారు. తూతూ మంత్రంగా రుణమాఫీ చేసి, పూర్తిగా రైతుల రుణాలు పోయాయని చంద్రబాబు చెప్పుకుంటున్నారని అన్నారు. రైతులకు అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. ప్రత్యేక ¬దా ఇవ్వాలని అందరం కోరుతున్నారని ,రాహుల్ ,సోనియాలు ఇప్పటికే పార్లమెంటులో మాట్లాడారని అన్నారు. రైతాంగం అప్పుల్లో మునిగిపోయిందని…వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకే జిల్లాలో రాహుల్ పర్యటిస్తున్నారని చిరంజీవి అన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించి మున్ముందు మంచి రోజులు వస్తాయని రాహుల్ హావిూ ఇచ్చారన్నారు. కాంగ్రెస్ హయాంలో రైతాంగం ఎంతో సుఖమయంగా ఉందన్నారు. నేషనల్ క్రైమ్ బ్యూరో గణాంకాల ప్రకారం గత సంవత్సరకాలంలో రైతుల ఆత్మహత్యలు 35 శాతం పెరిగాయన్నారు. రైతు రుణమాఫీని రూ.80 వేల కోట్ల నుంచి రూ.7వేల కోట్లకు కుదించి తూతూ మంత్రంగా రుణమాఫీ చేసి గొప్పలు చెప్పుకుంటున్నారని టీడీపీపై విమర్శలు గుప్పించారు. రైతు రుణమాఫీ ఎవరికీ అందలేదన్నారు. రైతులకు వెనెముక్కగా నిలిచేది కాంగ్రెస్సే అని చిరంజీవి స్పష్టం చేశారు.
కష్టాల్లో ఉన్నప్పుడే కాంగ్రెస్ పలకరిస్తుంది
ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడే రాహుల్ గాంధీ ఇక్కడ అడుగుపెట్టారు.. 1978 లో ఇందిరాగాంధీ అడుగు పెట్టారు. ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు ఇందిరా,రాజీవ్ గాంధీ లు వచ్చారని ఎపిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. పనికిమాలిన టిడిపి,బిజెపిలు పాలన చేస్తున్నాయని ఆయన అన్నారు. ప్రజలు ఇబ్బందులలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అండగా ఉంటుందని అన్నారు. ఎపి లో ప్రభుత్వం చేస్తున్న మోసాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నామని ఆయన చెప్పారు.రాహుల్ గాందీ రాకతో ఎపి సమస్యలపై మరింత తీవ్రంగా పోరాటం చేస్తామని ఆయన అన్నారు.
రాహుల్‌కు ఘన స్వాగతం
రైతు భరోసా యాత్రలో పాల్గొనేందుకు ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్‌గాంధీ శుక్రవారం ఉదయం అనంతపురం జిల్లా చేరుకున్నారు. కొడికొండ చెక్‌పోస్టు వద్ద కాంగ్రెస్ నాయకులు టి.సుబ్బిరామిరెడ్డి, కేవీపీ రామచంద్రారావు, పనబాక లక్ష్మీ, జేడీ శీలం, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి,కనుమూరి బాపిరాజు,చిరంజీవి, పళ్లం రాజు, సి.రామచంద్రయ్య, ద్రోణంరాజు శ్రీనివాస్ తదితరులు రాహుల్‌గాంధీకి ఘనస్వాగతం పలికారు. కోడికొండ చెక్‌పోస్టు నుంచి రాహుల్ ఓబుళదేవరచెరువుకు బయలుదేరారు. పుట్టపర్తి నియోజకవర్గంలోని ఓబుళదేవరచెరువు, నల్లమాడ మండలాల్లో సుమారు 15 కి.విూ మేర రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టారు. యాత్రలో భాగంగా రాహుల్‌గాంధీ 979లో ఇందిరాగాంధీ బహిరంగసభ నిర్వహించిన ప్రాంతంలో రాహుల్‌గాంధీ మొక్క నాటారు. ఉదయం జిల్లాకు చేరుకున్న రాహుల్ ముందుగా దివంగత నేత రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఇందిరాగాంధీ సభ నిర్వహించిన చోట మొక్క నాటారు. ఆ తరువాత ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించిన రాహుల్ 49 కుటుంబాలకు రూ.లక్ష చొప్పున సాయం అందజేశారు.